Prabhas Project K ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో అభిమానులను మరియు ప్రేక్షకులను విశేషం గా ఆకర్షిస్తున్న సినిమా ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’.టైం ట్రావెల్ నేపథ్యం లో వచ్చే సినిమాలు అంటేనే మన ఆడియన్స్ అమితాసక్తిని చూపిస్తారు.ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో భారీ స్కేల్ తో అలాంటి కాన్సెప్ట్ తో సినిమా తీస్తే అంచనాలు ఉండడం సహజమే కదా.
అయితే ఈ చిత్రం గురించి తెలుసుకునే కొద్దీ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తుంది..ఈ చిత్రం టైటిల్ ‘ప్రాజెక్ట్ కే’ లో K అంటే అర్థం కురుక్షేత్రం.డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని ప్రస్తుత కాలం నుండి ‘కురుక్షేత్ర’ సంగ్రామం జరిగిన కాలానికి పయనిస్తున్న నేపథ్యం మీద తెరకెక్కిస్తున్నాడట.టైం ట్రావల్ కాన్సెప్ట్ తో అప్పటి కాలం నాటి వాళ్ళు ప్రస్తుతం ఉన్న కాలానికి, ఇప్పుడు ఉన్న వాళ్ళు కురుక్షేత్రం జరుగుతున్న కాలం లోకి వెళ్లారట.
స్టోరీ లైన్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ..!, ఇక సినిమా టేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.సరిగ్గా డీల్ చేస్తే ఈ చిత్రం కూడా #RRR సినిమా లాగానే పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు ని దక్కించుకుంటుంది అంటున్నారు విశ్లేషకులు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్స్ అన్నీ కూడా పైన మీరు విన్న కథ కి చాలా దగ్గరగా ఉన్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించబోతుందో చూడాలి.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా చోట్ల ప్రారంభం అయిపోయింది.ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట.ఇది ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు గా చెప్తున్నారు.రెండు ఫ్లాప్స్ తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా అయ్యినప్పటికీ ఈ చిత్రానికి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది అంటే ప్రభాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.