Prabhas On Unstoppable Show: బాలకృష్ణ సారథ్యంలో అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ సాధించడంతో సీజన్ 2 ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈసారి సరికొత్తగా పొలిటికల్ లీడర్స్ ని కూడా షోకి ఆహ్వానిన్నారు బాలకృష్ణ. ఏపీ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్ స్టాపబుల్ షోకి గెస్ట్స్ గా వచ్చారు. పొలిటికల్ లీడర్స్ వచ్చినా ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. వారి నుండి కూడా బాలయ్య రొమాంటిక్ కోణం లాగి ఆడియన్స్ కి కావలసినంత ఫన్ అందిస్తున్నారు.

యంగ్ హీరోలు అడివి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ సైతం ఈ రియాలిటీ షోలో పాల్గొన్నారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వస్తున్నాడనే వార్త ఇండస్ట్రీని ని షేక్ చేస్తుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ నిర్వాహకులు ప్రభాస్ ని కలిసి ఒప్పించారట. ఆయన సానుకూలంగా స్పందించారట. సీజన్ 2 లో ప్రభాస్ పాల్గొనడం అనివార్యమే అంటున్నారు. ప్రభాస్ కనుక బాలయ్య షోకి వస్తే మామూలు సంచలనం అవ్వదు.
ఎందుకంటే… కాంట్రవర్సీ ప్రశ్నలకు అన్ స్టాపబుల్ కేర్ ఆఫ్ అడ్రస్. చంద్రబాబును 1995 ఆగస్టు సంక్షోభం గురించి అడిగి బాలయ్య తన గట్స్ ఏమిటో నిరూపించుకున్నాడు. ఆ క్రమంలో ప్రభాస్ కెరీర్ లో కూడా కొన్ని కాంట్రవర్సీలు,రూమర్స్ ఉన్నాయి. అవన్నీ బాలకృష్ణ తెరపైకి తెస్తాడు. ప్రభాస్ నోటి నుండి స్వయంగా సమాధానం చెప్పిస్తాడు. ముఖ్యంగా అనుష్క-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ గురించి కచ్చితంగా అడుగుతాడు. ఈ క్రమంలో ప్రభాస్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

అలాగే ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనేది కూడా హాట్ టాపిక్. ఈ ప్రశ్న కూడా బాలకృష్ణ ప్రభాస్ ని అడుగుతాడు అనడంలో సందేహం లేదు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమ, పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. సో… ప్రేక్షకులకు కావలసినంత కాంట్రవర్సీ, ఇవ్వాల్సిన క్లారిటీ ప్రభాస్ లైఫ్ లో ఉంది. కాబట్టి ఆయన కనుక బాలయ్య షోలో పాల్గొంటే ఈ సీజన్ కే బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. టీఆర్పీలు, వ్యూవర్షిప్ లెక్కలు బద్దలైపోతాయి. నిజంగా అది కార్యరూపం దాల్చాలని అందరూ కోరుకుంటున్నారు.