https://oktelugu.com/

Prabhas – MS Dhoni : ప్రభాస్, ధోని వీడియో.. అదిరిపోయింది

ప్రభాస్ కటౌట్, ధోనిని పోలి ఉంటుంది. పైగా ఇద్దరూ దృఢ కాయులే. బహుశా అందువల్లే కావచ్చు సలార్ సినిమాలో కొన్ని ఫైట్లు అచ్చుగుద్దినట్టు ధోని మేనరిజానికి సరిపోతాయి. అలా సరిపోయిన కొన్ని షాట్లను అత్యంత తెలివిగా ఈ వీడియో క్రియేటర్స్ వాడుకున్నారు. దానికి తగ్గట్టు సలార్ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగులను అనుసంధానించారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2024 10:39 pm
    Follow us on

    Prabhas – MS Dhoni : IPL T-20 కి ఇంకా కొద్దిరోజుల సమయమే ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు అప్పటిదాకా ఆగలేకపోతున్నారు. తమ అభిమాన జట్టుపై, అభిమాన ఆటగాడిపై ఏదో ఒక రూపంలో ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ప్రేమను కనబరుస్తున్నారు.. దానికోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అలాంటి సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు, చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ముడిపెట్టి వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.

    ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ కేస్ ఫైర్ భారీ విజయం సాధించింది. అందులో ఇంటర్వెల్ ఫైట్ కు ముందు ప్రభాస్ “నాకు నట్లు బిగించే పని అప్పగించార్రా” అని ఓ డైలాగ్ అంటాడు. ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడతాడు.. ఆ సన్నివేశాలను మహేంద్ర సింగ్ ధోనీకి ఆపాదించి.. వీడియోను రూపొందించారు. సలార్ సినిమాలో విలన్లను ప్రభాస్ చితగొట్టే సన్నివేశాలను, ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ తో వీరవిహారం చేసిన దృశ్యాలను.. మిళితం చేసి అభిమానులు రూపొందించిన వీడియో ఆకట్టుకుంటున్నది.. ప్రభాస్ చేతితో విలన్లను కొట్టిన దెబ్బలు, కత్తితో చేసిన ఫైట్లు, IPL లో ధోని చేసిన స్టంప్ ఔట్లు, కొట్టిన సిక్స్ లను .. కలగలిపి వీడియో రూపొందించారు. ఇది చూసేందుకు హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఈ వీడియోను రూపొందించిన చెన్నై అభిమానులు.. వీడియోను సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేసి మహేంద్ర సింగ్ ధోని, ప్రభాస్ ను ట్యాగ్ చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది..

    ప్రభాస్ కటౌట్, ధోనిని పోలి ఉంటుంది. పైగా ఇద్దరూ దృఢ కాయులే. బహుశా అందువల్లే కావచ్చు సలార్ సినిమాలో కొన్ని ఫైట్లు అచ్చుగుద్దినట్టు ధోని మేనరిజానికి సరిపోతాయి. అలా సరిపోయిన కొన్ని షాట్లను అత్యంత తెలివిగా ఈ వీడియో క్రియేటర్స్ వాడుకున్నారు. దానికి తగ్గట్టు సలార్ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగులను అనుసంధానించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు ప్రధాన బలం. ఇన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటున్నది. అయితే దీనిని చూసిన మిగతా జట్ల అభిమానులు తమ ఆరాధ్య ఆటగాళ్ల పై కూడా వీడియోలు రూపొందించాలని కోరుతున్నారు..