Prabhas- Kriti Sanon: న్యూయర్ వేడుకలకు ప్రభాస్ తన ప్రేయసి కృతి సనన్ తో మాల్దీవ్స్ వెళుతున్నారట. ఈ మేరకు వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు సంచలన ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా కృతి సనన్-ప్రభాస్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు వినిపిస్తుండగా… ఆయన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్ చేస్తుండగా, సీత పాత్ర కృతి సనన్ చేస్తున్నారు. ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్-కృతి సనన్ మధ్య ప్రేమ చిగురించింది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు హీరో వరుణ్ ధావన్ కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. వరుణ్ ధావన్-కృతి కాంబోలో తెరకెక్కిన తోడేలు మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో ‘కృతి సనన్ ఒకరి మనసులో ఉంది. ఆయన ముంబైలో లేరు. మరొక ప్రదేశంలో దీపికా పదుకొనెతో పాటు షూటింగ్ లో పాల్గొంటున్నారు,’ అని వరుణ్ కామెంట్ చేశాడు. వరుణ్ ధావన్ హింట్స్ ప్రకారం ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉంది. ఆయన హైదరాబాద్ లో దీపికతో పాటు ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గొంటున్నారు.
వరుణ్ వాఖ్యల అనంతరం ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు కామెంట్స్ మరింత సంచలనం రేపాయి. ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్ కృతికి ప్రపోజ్ చేశాడు. త్వరలో ఇద్దరు ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇవన్నీ ఒట్టి పుకార్లు… ప్రభాస్, నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కృతి సనన్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఎఫైర్ రూమర్స్ కొంచెం చల్లబడ్డాయి.

ఈ తరుణంలో ఉమర్ సంధు మరలా మంట రగిలించాడు. బాలీవుడ్ సెక్సియస్ట్ కపుల్ ప్రభాస్-కృతి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొరుకు మాల్దీవ్స్ వెళుతున్నారు. డిసెంబర్ 31 నైట్ ఇద్దరు అందమైన దీవుల దేశంలో ఆహ్లాదంగా గడపనున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. ఉమర్ సంధు సెన్సేషన్ కోసం ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నారా? లేక ప్రభాస్-కృతి సనన్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా? అనే సందేహాలు పెరిగిపోయాయి. ఈ ఎఫైర్ రూమర్స్ పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతి చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
Sexiest Couple #Prabhas & #KritiSanon will spend their NewYear in 🇲🇻 Maldives.
— Umair Sandhu (@UmairSandu) December 26, 2022