Krishnam Raju Samsmarana Sabha: చాలా కాలం తర్వాత ప్రభాస్ సొంతూరైన మొగల్తూరు వెళ్లారు. సెప్టెంబర్ 29న అక్కడ పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ జరగనుంది. దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీన కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో పూర్తి చేశారు. కృష్ణంరాజు దశదిన కర్మ కూడా హైదరాబాద్ లోనే చేశారు. అయితే కృష్ణంరాజు పుట్టిపెరిన మొగల్తూరులో భారీ ఎత్తున సంస్మరణ సభ ఏర్పాటు చేయాలని ప్రభాస్ నిర్ణయించారు. దీని కోసం పది రోజుల క్రిందటే ఏర్పాట్లు మొదలయ్యాయి.
50 మంది సిబ్బందిని మొగల్తూరు పంపారు. కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాట్లు చూసుకోవడనికి వారిని నియమించారు. దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారట. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… ఏర్పాట్లు చేశారట. ప్రభాస్ తన ఇంటికి వెళ్లే మార్గంలో కొత్తగా రోడ్లు వేయించడం విశేషం. 500 మంది పోలీసులు ఈ కార్యక్రమానికి బందోబస్తుగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Asiatic Lion: సొంత రాష్ట్రంలో సింహాలపై మోడీకి ఎందుకు అంత చిన్న చూపు?
ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ప్రైవేట్ ఈవెంట్ గా కృష్ణంరాజు సంస్మరణ సభ జరగనుంది. కృష్ణంరాజుకు సొంతూరు మొగల్తూరు అంటే వల్లమాలిన అభిమానం. ప్రతి ఏటా రెండుసార్లు మొగల్తూరు వెళ్లేవారట. తన పుట్టిపెరిన ఇంట్లో గడపడం, బంధువులను, మిత్రులను కలవడం ఆయన ఇష్టపడేవారట. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా కృష్ణంరాజు మొగల్తూరు వెళ్లడం లేదట. సొంతూరిని అంతగా ఇష్టపడే కృష్ణంరాజు కోసం భారీగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.
ప్రభాస్ ని కృష్ణంరాజు తన నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పెదనాన్న పేరు నిలబెట్టారు. ఇక కృష్ణంరాజు-ప్రభాస్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కాయి. బిల్లా మూవీ కోసం మొదటిసారి ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించారు. తర్వాత రెబల్ మూవీలో తండ్రీ కొడుకులుగా కనిపించారు. కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం రాధే శ్యామ్ కావడం విశేషం. ఆ మూవీలో ఆయన పరమహంసగా చిన్న పాత్ర చేశారు. కృష్ణంరాజుకు అబ్బాయిలు లేరు. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ బాధ్యత ప్రభాస్ తీసుకున్నారు.
Also Read: Chiranjeevi- Ram Charan: చిరంజీవి, రాంచరణ్ కు కలిసొచ్చిన తేదీ ఏంటో తెలుసా?