Prabhas- NTR: ప్రభాస్-ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఈ అరుదైన దృశ్యానికి వేదిక సిద్ధమైంది. ఎన్టీఆర్ 30 ప్రారంభ వేడుకలో ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలవనున్నారనేది టాలీవుడ్ టాక్. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాల్సిన ఎన్టీఆర్ 30వ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఫిబ్రవరి 24న ఈ వేడుక ఘనంగా నిర్వహించాలని యూనిట్ భావించారు. అయితే తారకరత్న మరణంతో షెడ్యూల్ మారింది. అనుకున్న ప్రకారం ఫిబ్రవరిలో లాంచింగ్ ఈవెంట్ జరగకపోవచ్చు. తారకరత్న దశ దిన కర్మ ముగిసే వరకు ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమాలకు పూనుకునే అవకాశం లేదు.
అయితే మార్చి మొదటివారంలో లాంచింది ఈవెంట్… చివర్లో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టే అవకాశం కలదు. మార్చి 20లోపే చిత్రీకరణ మొదలుపెట్టాలనేది యూనిట్ ఆలోచన. షూటింగ్ కి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. అక్కడే మొదటి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. అనంతరం గోవా షెడ్యూల్ ఉంటుందని వినికిడి.
కాగా ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమం ఎప్పుడు జరిగినప్పటికీ ముగ్గురు ప్రముఖులు హాజరుకానున్నారట. వారు ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ 30 గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలని యూనిట్ భావిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు స్టార్స్ ని గెస్ట్స్ గా పిలుస్తున్నారట. ఎన్టీఆర్ కి రాజమౌళి అత్యంత సన్నిహితుడు కాబట్టి పిలిస్తే రాకుండా ఉండలేరు. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. మరో చిత్రం కూడా ఆయనకే కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరి కంటే ప్రభాస్ ఈ ఈవెంట్ కి రావడం చాలా ప్రత్యేకం. కారణం… ఎన్టీఆర్-ప్రభాస్ కలిసి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్-ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన దాఖలాలు లేవు. కాబట్టి ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆచార్య ఫెయిల్యూర్ నేపథ్యంలో భారీ హిట్ కొట్టి కమ్ బ్యాక్ కావాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఆయనకు ఈ చిత్ర విజయం చాలా అవసరం. అలాగే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ బద్దలే.