AP Politics: దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాలించింది. చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాతకుపోయింది. అయితే ఇదంతా గతం. ఇతర రాజకీయ పక్షాల నుంచి పోటీ లేని సమయంలో అన్న మాట. పశ్చిమబెంగాల్ లో వామపక్షాలు, గుజరాత్ లో బీజేపీ సుదీర్ఘ కాలం ప్రాతనిధ్యం వెనుక పాజిటివ్ ఓటు బ్యాంకే కారణం. ఇవి కంటీన్యూవస్ గా గెలవడానికి ఓటర్లను ఓన్ చేసుకోవడమే ప్రధాన కారణం. అందుకే అక్కడ విపక్షాలు ఎన్నిరకాలు ప్రయత్నించినా వర్కవుట్ కావడం లేదు. సుదీర్ఘ కాలం పోరాటం చేస్తే కానీ పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ వామపక్షాల కోటలను బద్దలు కొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో జగన్ కూడా పాజిటివ్ ఓటు బ్యాంక్ ను ఓన్ చేసుకునే యత్నంలో ఉన్నారు. నాది 30 సంవత్సరాల రాజకీయం అంటూ పాదయాత్ర నాడే చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకు తగ్గట్టు కసరత్తు ప్రారంభించారు.

రాష్ట్ర ప్రగతిని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై విపక్షాలు ప్రచారం చేస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. తమ ఓటింగ్ ను బాగా పెంచుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ నాయకులు, మంత్రులు తరచూ అన్న మాటలు చూస్తుంటే మాత్రం పథకాలు నూటికి 80 శాతం లబ్ధిదారులకు చేరాయని విశ్వసిస్తున్నారు. అందుకే వారు మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటింగ్ శాతం పెరిగిందని 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తామంటున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓటింగ్ శాతంతో విజయం సాధించామని.. ఈ ఎన్నికల్లో మరో 10 శాతం పెరుగుతుందని కూడా లెక్కలు కడుతున్నారు. అందుకు లోకల్ బాడీ ఎలక్షన్ లో గణాంకాలను చెబుతున్నారు. 65 శాతంతో లోకల్ బాడీలో ఏకపక్ష విజయం సాధించామని.. దానికి పాజిటివ్ ఓటు బ్యాంకే కారణమని విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.
ఏపీ సమాజంలో అతి పెద్ద సెక్షన్ అయిన పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తమ వెంట నడుస్తున్నాయని.. రెండో సెక్షన్ గా ఉండే ఎగువ మధ్యతరగతి, ధనికులు, తటస్థులు, ఉద్యోగులు వ్యతిరేకమని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వారి ప్రభావం ఏమాత్రం ఉండదన్న ధీమా అధికార వైసీపీలో కనిపిస్తోంది. పైగా వీరు ఓటింగ్ కూడా వచ్చేది చాలా తక్కువ శాతమేనని అంచనా వేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలే పాజిటివ్ ఓటు బ్యాంక్ గా వైసీపీ భావిస్తోంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకులైన తటస్థులు, విద్యాధికులు, ఉపాధ్యాయుల ఓటు షేర్ కాకుండా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అటు వైసీపీ ప్రభుత్వం పాజిటివ్ ఓటు బ్యాంక్ గా భావిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులను సైతం తమ వైపు టర్న్ అయ్యేలా విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

మొన్న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమంలోపవన్ సంక్షేమ పథకాలపైనే మాట్లాడారు. తాము పవర్ లోకి వస్తే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించారు. అటు చంద్రబాబు సైతం సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత ఇచ్చారు. ఇప్పుడున్న పథకాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. అంటే పాజిటివ్ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు పాజిటివ్ ఓటు బ్యాంక్ పై దృష్టాసారించాయన్నమాట. పాజిటివ్ రాజకీయాలే నడుస్తున్నయన్న మాట.