Pope Francis Passed Away: పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటినాలోని బ్యునస్ ఎయిర్స్ లో డిసెంబర్ 17 1936లో జన్మించారు. ఈయన వయసు 88 సంవత్సరాలు. కొద్దిరోజులుగా పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటికన్ సిటీ లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈయన తల్లిదండ్రుల పేరు రెజీనా సివోరి, మారియో జోస్ బెర్గో గ్లియో. ఈయన డికాస్టేరీ ఫర్ ప్రమోటింగ్ ఇంటిగ్రల్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు.. ఈయన 1955, 1970 కాలంలో గ్రాడ్యుయేషన్ పొందాడు.. ఇతడి తాతయ్య ఫ్రాన్సిస్కో, నానమ్మ సివోరి స్టర్లా కూడా క్రీస్తు భక్తులు. అంతకాలంగా పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటికన్ సిటీలో చికిత్స పొందుతున్నారు. సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు.
Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం.. నెల రోజుల్లో వెయ్యి మంది వీసాలు రద్దు
ఇదీ నేపథ్యం
పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చికి అధిపతిగా ఉన్నారు. రోమ్ బిషప్ గా ఈయనను పేర్కొంటారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గో గ్లియో.. 1936 సంవత్సరంలో డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యునస్ ఎయిడ్స్ ప్రాంతంలో జన్మించారు.. ఈయన తన పూర్వికుడైన పోపు బెనేడెక్ట్ -14 రాజీనామా చేయడంతో.. 2013 మార్చి 13న 266 వ పోప్ గా నియమితుడయ్యాడు. అమెరికా నుంచి మొట్టమొదటి పోప్ గా ఎన్నికైన వ్యక్తిగా జార్జ్ మారియో గుర్తింపు పొందాడు. అలాగే ఫ్రాన్స్ అనే పేరు తీసుకున్న మొదటి వ్యక్తి కూడా. పోప్ ఫ్రాన్సిస్ దాదాపు 12 సంవత్సరాల పాటు వాటికన్ సిటీకి అధిపతిగా ఉన్నాడు. సామాజిక న్యాయానికి కట్టుబడి పని చేశాడు. పేదల పట్ల నిబద్దత కలిగి ఉండాలని పదేపదే చెప్పేవాడు. క్యాథలిక్ చర్చిని సమూలంగా ప్రక్షాళన చేశాడు. ఆదాయ అసమానతను నిర్వహించాడు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న దేశాలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. మరణశిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. శరణార్థుల కోసం, వలసదారుల కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు ఉదార స్వభావం చూపించాలని కోరాడు. పోప్ మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలన సృష్టించాయి.. వివిధ మతాల మధ్య సామాజిక అనుబంధం ఉండాలని పదేపదే పోప్ ఫ్రాన్సిస్ చెప్పేవాడు. విభిన్న విశ్వాసాలను ప్రజలు ఒకే వేదికను పంచుకోవాలని.. ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకోవాలని సూచించేవాడు.. సరళమైన మత సంబంధమైన విధానం మనుషుల మధ్య ప్రేమను, గాడతను వ్యాప్తి చెందిస్తుందని పదే పదే చెప్పేవారు.. క్యాథలిక్ చర్చికి పూర్వ వైభవం తీసుకురావడానికి పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా కృషి చేశారు. కరోనా సమయంలో వాటికన్ సిటీని క్వారంటెన్ సెంటర్ గా మార్చడానికి పోప్ ఫ్రాన్సిస్ ఏమాత్రం వెనకాడ లేదు. మత పరి వ్యాప్తకుడిగా మాత్రమే కాకుండా.. సంస్కరణలకు ఆధ్యుడిగా పోప్ ఫ్రాన్సిస్ నిలిచారు. అందువల్లే ఆయనను ఈ కాలపు ఏసుక్రీస్తు అని క్రైస్తవులు భావిస్తుంటారు. ఆయన కన్నుమూసిన నేపథ్యంలో.. వాటికన్ సిటీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు… వారికి మాత్రమే ఛాన్స్..