Pooja Hegde: పట్టుచీరలో మెరిసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సాంప్రదాయ కట్టులో కూడా గ్లామర్ యాంగిల్ మిస్ కాలేదు. డ్రెస్ ఏదైతేనేమి హాట్నెస్ కామన్ అని రుజువు చేసింది. ఇంస్టాగ్రామ్ లో పూజా ట్రెడిషనల్ లుక్ షేర్ చేశారు. ఇటీవల పూజా బ్రదర్ మ్యారేజ్ జరిగింది. సదరు వేడుక కోసం పూజా ఇలా తయారయ్యారు. అన్నయ్య పెళ్లి విషయం ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. వదినమ్మకు స్వాగతం పలుకుతూ కామెంట్ పోస్ట్ చేశారు. పూజా అన్నయ్య వివాహ విషయం తెలిసిన ఫ్యాన్స్ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే మరి మీ పెళ్లి ఎప్పుడని పూజాను అడుగుతున్నారు.
నటిగా పూజా బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడే పెళ్లి చేసుకునే అవకాశం లేదు. నిజానికి పూజా వయసు మూడు పదులు దాటిపోయింది. పెళ్లి చేసుకోవడానికి ఇదే అనువైన సమయం. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు పెళ్లిని అడ్డంకిగా భావిస్తారు. అలాగే 35 ఏళ్ల తర్వాతే పెళ్లి ఆలోచన చేస్తారు. పూజాకు కూడా ఇప్పట్లో పెళ్లి ప్రణాళికలు లేవని సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఐతే అప్పుడప్పుడు ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల ఏకంగా సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ నడుపుతుందని ఓ హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. పూజా-సల్మాన్ ఎఫైర్ నడుపుతున్నారు. ఈ కారణంగా సల్మాన్ నిర్మాణ సంస్థలో పూజా రెండు చిత్రాలకు సైన్ చేసిందని ట్వీట్ చేశారు. ఈ పుకార్లను సల్మాన్ టీం కొట్టిపారేశారు. సల్మాన్ ఖాన్ కి పూజా వయసులో కూతురితో సమానం. ఇవన్నీ గాలి వార్తలని ఖండించారు.
ప్రస్తుతం పూజా సల్మాన్ కి జంటగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో నటిస్తుంది. వెంకటేష్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక రోల్స్ చేయడం విశేషం. ఇటీవల టీజర్ విడుదల చేశారు. రంజాన్ కానుకగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ విడుదల కానుంది. అలాగే పూజా చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 28. సెట్స్ పై ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. మహేష్ తో రెండోసారి జతకడుతున్న పూజాకు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ. గత ఏడాది పూజా వరుస ప్లాప్స్ చవిచూశారు.