https://oktelugu.com/

Samantha: పూజాహెగ్డేకు సమంత కౌంటర్ అదిరిపోయిందిగా.. కోల్డ్ వార్ పీక్స్

pooja hegde reacts on samantha arabic kuthu steps : టాలీవుడ్ అగ్రహీరోయిన్లు సమంత, పూజాహెగ్డే మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గత రెండేళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇరువురు హీరోయిన్ల అభిమానులు రెండుగా చీలి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. ఇక సమంతకు తోడుగా నందినీ రెడ్డి, చిన్మయి వంటి వారు కూడా కామెంట్లతో రెచ్చిపోయారు. ఇలా సమంత, పూజాహెగ్డేల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2022 / 06:16 PM IST
    Follow us on

    pooja hegde reacts on samantha arabic kuthu steps : టాలీవుడ్ అగ్రహీరోయిన్లు సమంత, పూజాహెగ్డే మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గత రెండేళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇరువురు హీరోయిన్ల అభిమానులు రెండుగా చీలి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు.

    ఇక సమంతకు తోడుగా నందినీ రెడ్డి, చిన్మయి వంటి వారు కూడా కామెంట్లతో రెచ్చిపోయారు. ఇలా సమంత, పూజాహెగ్డేల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ వివాదం చెలరేగింది. అసలు ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య వివాదం ఎలా పుట్టిందనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

    సమంత, పూజాహెగ్డే మధ్య వివాదానికి ‘మజిలీ’ సినిమానే కారణం. ఈ సినిమా చూసిన పూజాహెగ్డే.. ‘సమంత ఏమంత అందంగా లేదు కదా’ అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. వెంటనే దాన్ని డిలీట్ చేసింది. కానీ అంతలోనే నష్టం జరిగిపోయింది.

    సమంత కూడా పూజాహెగ్డేకు గట్టి కౌంటర్ యే ఇచ్చింది. పూజాహెగ్డేకు వ్యతిరేకంగా ట్వీట్ల దాడి జరిగింది. సమంత, నందినిరెడ్డి, చిన్మయిలు కలిసి పూజా హెగ్డే మీద పరోక్షంగా సెటైర్లు వేశారు. దీంతో ఈ వార్ తీవ్రమైంది. అప్పటి నుంచి వీరి మధ్య ట్రోలింగ్ సాగుతోంది. తాజాగా విజయ్, పూజా హెగ్డే నటించిన హలమితు హబిబూ అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఆ పాటకు విజయ్ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే ఈ వీడియోను షేర్ చేసింది.

    తాజాగా సమంత దీనికి కౌంటర్ ఇచ్చింది. ఎయిర్ పోర్టులో స్టెప్పులు వేసింది. దానిపై పూజా హెగ్డే స్పందించింది. ‘అద్భుతం అన్నట్టుగా వివరణ ఇచ్చింది. కానీ సమంత మాత్రం ఇంకా స్పందించలేదు. సమంత రిప్లై ఇస్తే ఈ కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.