
Pooja Hegde: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ తో సావాసం చెయ్యడం తప్పనిసరి, దానిని ఎవ్వరూ ఆపలేరు కూడా.ముఖ్యంగా హీరోయిన్స్ పై రూమర్స్ తరచూ ఎదో ఒక విషయం లో వస్తూనే ఉంటుంది, మొదట్లో ఈ రూమర్స్ పై వాళ్ళు చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కానీ, వీటిని ఇక ఆపలేము అని తెలిసిన తర్వాత పట్టించుకోవడం మానేసి ఎవరి పనులను వాళ్ళు చూసుకుంటున్నారు.
ఒక ఇండస్ట్రీ లో క్రేజ్ సంపాదిస్తేనే వంద రూమర్స్ వస్తాయి, అలాంటి రెండు మూడు ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోల పక్కన నటిస్తూ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ పరిస్థితి ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.ప్రస్తుతం పూజ హెగ్డే అలాంటి పరిస్థితినే ఎదురుకుంటుంది.తెలుగు , తమిళం , హిందీ బాషలలో వరుసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే పై చాలా కాలం నుండి సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ ప్రచారం అవుతూ ఉన్నాయి.
రాధే శ్యామ్ సినిమా షూటింగ్ సమయం లో ప్రభాస్ తో ప్రేమాయణం నడిపిందని, వీళ్లిద్దరి మధ్య గొడవలు కూడా జరిగిందంటూ రూమర్స్ వచ్చాయి.ఇక ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా షూటింగ్ సమయం లో సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే డేటింగ్ లో ఉందని, వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి.

దీనిపై రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా పూజ హెగ్డే అందుకు సమాధానం ఇస్తూ ‘ప్రస్తుతం నేను ఊపిరి సలపనంతా బిజీ గా ఉన్నాను.నా ద్రుష్టి మొత్తం సినిమాలపైనే, ప్రేమకు కానీ, డేటింగ్ కి కానీ నా వద్ద ఎలాంటి సమయం లేదు.దయచేసి పిచ్చి రూమర్స్ ని నమ్మొద్దు’ అంటూ చెప్పుకొచ్చింది.ఆమె క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా ఈ రూమర్స్ కి సోషల్ మీడియా లో చెక్ పడుతుందో లేదో చూడాలి.