Pooja Hegde Remuneration: స్టార్ లేడీ పూజా హెగ్డేకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. రాధే శ్యామ్, ఆచార్య ఆల్ టైం డిజాస్టర్స్ గా నిలిచాయి. అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాల జాబితాలో చేరాయి. కోలీవుడ్ మూవీ బీస్ట్ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో విజయ్ కి ఎదురైన పరాజయం బీస్ట్ అని చెప్పొచ్చు. వరుస హిట్స్ ఇచ్చిన పూజా, వరుస ప్లాప్స్ తో హ్యాట్రిక్ పూర్తి చేసింది. దానికి తోడు విజయ్ దేవరకొండతో చేస్తున్న జనగణమన మధ్యలో ఆగిపోయింది. పవన్-హరీష్ శంకర్ మూవీలో ఛాన్స్ కోల్పోయింది. ఆ రెండు సినిమాలు చేజారడం వలన పూజా హెగ్డే రూ. 10 కోట్ల వరకు నష్టపోయింది.

కెరీర్ గ్రాఫ్ డౌన్ అయినా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గించడం లేదనే మాట వినిపిస్తోంది. ఆ మాటకొస్తే ఇంకా పెంచే సూచనలు కనిపిస్తున్నాయట. ప్రస్తుతం పూజా సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. రెమ్యూనరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండే పూజా హెగ్డే అసలు తగ్గేదేలే అంటుందట. అయితే ఈ ఆరోపణలు ఆమె వరకు చేరాయి. దీంతో సమాధానం చెప్పారు. నేను అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాను, నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాను అనడంలో ఏమాత్రం నిజం లేదని పూజా హెగ్డే వెల్లడించారు.
నాకు పాత్రలే ముఖ్యం. డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వను. పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా మూవీ చేస్తాను. కేవలం డబ్బు ముఖ్యం అనుకుంటే ఇప్పుడు నా చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉండేవి, అని పూజా స్పష్టత ఇచ్చారు. పరోక్షంగా నాకు డబ్బు పిచ్చి లేదని పూజా హెగ్డే చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మధ్య రోజా భర్త దర్శక నిర్మాత సెల్వమణి పూజా హెగ్డే పై దారుణ ఆరోపణలు చేశారు. పెద్ద మొత్తంలో వ్యక్తిగత సిబ్బందిని మైంటైన్ చేస్తున్న పూజా… వారి ఖర్చులు, రెమ్యూనరేషన్స్ నిర్మాతల నుండి వసూలు చేస్తూ భారం పెంచేస్తున్నారని విమర్శించారు.

ఈ తరహా ఆరోపణలు రెండు మూడు సందర్భాల్లో పూజా హెగ్డేపై వినిపించాయి. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం సర్కస్ డిసెంబర్ 23న విడుదల అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా పీరియాడిక్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించారు. తెలుగులో పూజా హెగ్డే ఎస్ ఎస్ ఎం బి 28లో నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ వరుసగా మూడో సినిమాలో అవకాశం ఇచ్చాడు.