https://oktelugu.com/

Ponniyin Selvan టీజర్ టాక్ : రాణుల కోసం పోరు.. మణిరత్నం మార్క్ మాయాజాలం మళ్లీ మొదలైంది..

Ponniyin Selvan-1 :  కళాత్మక చిత్రాలకు మారు పేరు మణిరత్నం.. ఆయన తీసిన అద్భుత కళాఖండాల చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన తేలిపోతున్నారు. మునుపటిలా చిత్రాలు తీయలేకపోతున్నారు. ఈ తరం ఆలోచనలతో సినిమాలు నిర్మించలేకపోతున్నారు. అందుకే వరుస ఫ్లాప్ లు కొనితెచ్చుకుంటున్నారు. కొందరు అగ్ర హీరోలు ఈయనతో సినిమాలు తీసేందుకు కూడా ముందుకు రావడం లేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక చారిత్రక యోధుడి కథతో మణిరత్నం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2022 / 07:21 PM IST
    Follow us on

    Ponniyin Selvan-1 :  కళాత్మక చిత్రాలకు మారు పేరు మణిరత్నం.. ఆయన తీసిన అద్భుత కళాఖండాల చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన తేలిపోతున్నారు. మునుపటిలా చిత్రాలు తీయలేకపోతున్నారు. ఈ తరం ఆలోచనలతో సినిమాలు నిర్మించలేకపోతున్నారు. అందుకే వరుస ఫ్లాప్ లు కొనితెచ్చుకుంటున్నారు. కొందరు అగ్ర హీరోలు ఈయనతో సినిమాలు తీసేందుకు కూడా ముందుకు రావడం లేదు.

    చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక చారిత్రక యోధుడి కథతో మణిరత్నం మన ముందుకు వస్తున్నారు. అదే ‘పొన్నియన్ సెల్వన్-1’. విక్రమ్, కార్తి , జయం రవి , ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి టాప్ హీరో హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఈ చారిత్రక చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    ఈ శుక్రవారం ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ను తెలుగులో స్టార్ హీరో మహేష్ బాబు విడుదల చేసి టీజర్ అద్భుతం అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

    హీరో విక్రమ్ ఇందులో వ్యసనపరుడు, ఒక ఫెయిల్యూర్ ప్రేమికుడు అని తెలుస్తోంది. ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా ఆమెను మర్చిపోవడానికేనని.. నన్ను మర్చిపోవడానికి ’ అంటూ విక్రమ్ పలికిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

    చోళ సామ్రాజ్యం నేపథ్యంలో నాటి రాజుల కథను మణిరత్నం తాజాగా తీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా మణిరత్నం తీశాడు.తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. చోళ సామ్రాజ్యంలో అందమైన రాణుల కోసం జరిగిన పోరాట యుద్ధాల నేపథ్యంలో ఈ కథ ఉన్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.

    ట్రైలర్ ను కింద చూడొచ్చు..