Homeట్రెండింగ్ న్యూస్Chennai Rats: ఎలుకలు చేసిన పనికి.. నిర్దోషులుగా బయటికొచ్చారు.. అసలు ఏం జరిగిందంటే?

Chennai Rats: ఎలుకలు చేసిన పనికి.. నిర్దోషులుగా బయటికొచ్చారు.. అసలు ఏం జరిగిందంటే?

Chennai Rats: గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది వినడానికి విడూరంగా ఉన్నా చెన్నైలో నిజంగానే జరిగింది. దేశాన్ని, యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్‌. మత్తుకు బానిసై యువత వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మాదకద్రవ్యాల మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్‌కు బానిసై వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల కారణంగా నిర్దోషులుగా బయటికొచ్చారు.

రెండేళ్ల క్రితం స్మగ్లర్ల అరెస్ట్‌..
కఠినమైన రూల్స్‌ ఉన్నా, పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ సరఫరా మాత్రం ఆగడం లేదు. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్‌ లో ఇద్దరు స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి 22 కేజీల గంజాయిని సీజ్‌ చేశారు పోలీసులు. అందులోంచి కొంత భాగాన్ని పరీక్షల కోసం పంపించారు. పోలీసులు చార్జిషీట్‌ ఫైల్‌ చేసి కోర్టుకు సమర్పించారు. అప్పటి నుంచి ఈ కేసు చెన్నై మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోది. సీజ్‌ చేసిన 22 కేజీల గంజాయిలో టెస్టుల కోసం కొంత పోగా 21 కేజీల 900 గ్రాముల గంజాయిని పోలీసుల భద్రపరిచారు.

గంజాయి మాయం చేసిన ఎలుకలు..
అయితే కేసు విచారణ సమయంలో ఎవిడె¯Œ ్స గా గంజాయిని చూపించాల్సిన సమయంలో పోలీసులు వారి ఆధీనంలో ఉన్న 21 కేజీల 900 గ్రాముల గంజాయికి బదులు 11 కేజీలు మాత్రమే కోర్టుకు సమర్పించారు. మిగిలిన మొత్తం ఏమైందని కోర్టు పోలీసులను ప్రశ్నించగా ఎలుకలు తిన్నట్లుగా చెప్పారు. పోలీసులు చెప్పిన ఈ సమాధానం తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు చార్జి షీట్లో తెలిపిన విధంగా కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయారని, దీంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గంజాయి నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఎలుకల పుణ్యమాని నిందితులు జైలు శిక్ష తప్పించుకోవడంతో చర్చకు దారితీసింది.

ఇంటి దొంగల పనేనా?
అయితే గంజాయి మాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి తినే పదార్థం కాదు. ఎలుకలకు ఇష్టమైన ఆహారం అంతకన్నా ఆకదు. అయినా పోలీసులు కోర్టుకు ఎలుకలు తిన్నాయనడం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ఇంటిదొంగల పనే అయి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎలుకలు తిన్నాయని పేర్కొంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. గంజాయి తగ్గడంతో స్మగ్లర్లు నిర్దోషులుగా బయటకు వచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular