Police Viral Video: పోలీసా? మజాకా.. సినిమాల కంటే మించి రియల్ ఫైట్.. వైరల్ వీడియో..

Police Viral Video: సినిమాల్లో విలన్లపై మన హీరోలు విరుచుకుపడి దంచి కొట్టడం చూస్తుంటాం. ముఖ్యంగా పోలీస్ వేషాలు వేసిన హీరోలు అయితే కోర మీసంతో కొరకరగా విలన్లను ఏరిపారేస్తుంటారు. బయట మన పోలీసులు ఆ రేంజ్ లో ఫైట్లు చేసిన దాఖలాలు చాలా తక్కువే. చేసినా అవి ఫొటోలు, వీడియోల వరకూ రావు. మనకు కనిపించవు. కానీ ఈ కేరళ పోలీస్ చేసిన సాహసం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒక గుండా చేతిలో […]

Written By: NARESH, Updated On : June 21, 2022 12:24 pm
Follow us on

Police Viral Video: సినిమాల్లో విలన్లపై మన హీరోలు విరుచుకుపడి దంచి కొట్టడం చూస్తుంటాం. ముఖ్యంగా పోలీస్ వేషాలు వేసిన హీరోలు అయితే కోర మీసంతో కొరకరగా విలన్లను ఏరిపారేస్తుంటారు. బయట మన పోలీసులు ఆ రేంజ్ లో ఫైట్లు చేసిన దాఖలాలు చాలా తక్కువే. చేసినా అవి ఫొటోలు, వీడియోల వరకూ రావు. మనకు కనిపించవు.

కానీ ఈ కేరళ పోలీస్ చేసిన సాహసం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒక గుండా చేతిలో పెద్ద ఆయుధం ఉన్నా కూడా వెరవకుండా అతడిపై దూకి తనను తాను కోపాడుకోవడమే కాదు.. ఆ గుండా మెడలు వంచి పట్టుకొని అరెస్ట్ చేసిన ఈ పోలీస్ సాహసానికి నిజంగానే ప్రశంసలు కురుస్తున్నాయి. నిజజీవితంలోనూ ఇలాంటి పోలీస్ సాహసాలను చూస్తామా? అన్నంతగా ఈ వీడియోలో పోలీస్ రెచ్చిపోవడం విశేషం.

కేరళలోని ఒక రహదారి పక్కన ఓ పోలీస్ వాహనం సడెన్ గా వచ్చి ఆగింది. అందులోంచి డోర్ తీసుకొని ఒక పోలీస్ అధికారి దిగుతాడు. ఇంతలోనే ఆ పక్కన బైక్ పై ఉన్న ఓ వ్యక్తి వేట కొడవలితో పోలీస్ పై దాడి చేస్తాడు. దాంతో సదురు పోలీస్ తన చేతుల్లో ఎలాంటి ఆయుధం లేకున్నా కూడా ఏమాత్రం భయపడకుండా ఆ గుండాను ఎదుర్కొన్నాడు. చివరకు ఆ వ్యక్తిని కిందపడేసి మరీ అతడి చేతిలోని ఆయుధాన్ని లాక్కుంటాడు. ఇక ఆ తర్వాత మరో పోలీస్ వచ్చి ఆ ఆయుధాన్ని లాగేసుకుంటారు. అక్కడున్న వారు సాయం చేయడంతో ఆ గుండా ఆటకట్టైంది.

ఏకంగా కత్తితో దాడి చేయడానికి వచ్చినా వెరవకుండా ధైర్యంగా పోరాడిన ఆ పోలీస్ పేరు అరుణ్ కుమార్. అలప్పజ నూరనాడ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆ గుండా దాడిలో ఆ పోలీస్ అధికారి చేతికి గాయమై ఏడు కుట్లు కూడా పడ్డాయి. కొడవలితో దాడి చేసిన వ్యక్తిని ‘సుగతన్’గా గుర్తించారు.

ఈ వైరల్ వీడియోను తెలంగాణ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా ట్విట్టర్ లో పంచుకోగా వైరల్ అయ్యింది. అసలైన హీరో ఇలా ఉంటాడు అని ఆమె క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://twitter.com/SwatiLakra_IPS/status/1538370942874705920?s=20&t=nCyEkmKtJ_KLdO4zryvMdA