Homeట్రెండింగ్ న్యూస్Pini Village: ఆ గ్రామంలో ఐదు రోజులు నగ్నంగా మహిళలు.. ఇండియాలో వింత ఆచారం!

Pini Village: ఆ గ్రామంలో ఐదు రోజులు నగ్నంగా మహిళలు.. ఇండియాలో వింత ఆచారం!

Pini Village: ఇండియాలో మహిళల్ని దేవతలతో సమానంగా చూస్తారు. అందుకే స్త్రీలను పూజించే చోట దేవతలు తిరుగుతూ ఉంటారని అంటారు. మరి అలాంటి నేలపై ఓ చోట మహిళలు ఏకంగా ఐదు రోజులు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు అలా ఎందుకుంటారు… వాళ్లను అలా ఉండమని ఎవరు ఆదేశించారు. వాళ్లు ఎందుకు పాటిస్తున్నారు. ఆ వింత ఆచారం విశేషాలు తెలుసుకుందాం.

పిని గ్రామంలో ఈ ఆచారం..
హిమాచల్‌ ప్రదేశ్‌లోని పిని అనే చిన్న గ్రామం. గ్రామం చిన్నదే అయినా గుర్తింపు మాత్రం దేశవ్యాప్తంగా ఉంది. కారణం… అక్కడి మహిళలు పాటించే ఆచారమే. చాలా మంది ఇలాంటి ఆచారం ఒకటుంది అంటే నమ్మలేరు. కట్టుకథ అనుకుంటారు. కానీ దీన్ని నిజంగానే అక్కడి మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారు. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. ఎవరూ అలా ఉండమని వారిని ఆదేశించలేదు. వారంతట వారే ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు. ఈ విషయంలో వారు ఏమాత్రం రాజీపడరు. ఎంతో నిష్టతో ఈ నగ్న దీక్ష పాటిస్తున్నారు.

దేవత కోసమే దీక్ష..
ఇండియా అభివృద్ధి చెందుతూ… ఇతర దేశాల ఆధునిక పోకడలను అలవాటు చేసుకుంటున్నా… ఇప్పటికీ కొన్ని ఊళ్లలో పాత ఆచారాలను, సంప్రదాయాలనూ పాటిస్తూనే ఉన్నారు. వాటిలో పిని కూడా ఉంది. ఈ ఊరు సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంది. దీని మొత్తం జనాభా 2,593 మంది. ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు. ఈ సందర్భంగా ఓ కథ వారికి తెలుస్తుంది. అదేంటంటే… పూర్వం ఇక్కడ లాహు ఘోండ్‌ దేవత ఉండేదట. ఆమె రాక్షసుల్ని చంపి… ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజులపాటు… ఈ నగ్న దీక్షను చేపడుతున్నారు మహిళలు.

కఠిన నిబంధనలు:
ఐదు రోజుల దీక్షలో భాగంగా.. మహిళలు నూలు పోగు కూడా ధరించరు. పూర్తిగా నగ్నంగా ఉంటారు. అంతేకాదు. ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లోని భర్త, భార్య ఎవరూ నవ్వకూడదు. అలా నవ్వితే దేవతకు ఆగ్రహం వస్తుందని భావిస్తారు. అందువల్ల నవ్వకుండా జాగ్రత్త పడతారు. ఏటా భాద్రబ్‌ నెలలో ఐదు రోజులు వేడుకలు జరుపుతారు. వేడుకల మొదటి రోజునే దేవత… రాక్షసుల్ని చంపేసిందట. అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో మగవారు మద్యం తాగరు. ఈ ఐదు రోజులూ… ఆ గ్రామంలోకి బయటివారిని అనుమతించరు. ఇలాంటి బలమైన ఆంక్షల్ని అక్కడ అమలు చేస్తున్నారు.

నగ్నంగా ఎందుకు?
దేవతను సంతృప్తి పరచాలంటే… నైవేద్యం పెట్టొచ్చు, పూజలు చెయ్యొచ్చు, పండ్లు, స్వీట్లూ ఇవ్వొచ్చు… కానీ నగ్నంగా ఎందుకు ఉండటం అంటే… అందుకు రెండు కారణాలు ఉన్నాయి. పూర్వం రాక్షసులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారట. వారిని సంహరించడం ద్వారా ఆ దేవత మహిళల మానాన్ని కాపాడటంతో… ఆమెకు ఆ విధంగా తమ భక్తిని చాటుకుంటున్నారు అక్కడి మహిళలు. మరో కారణం ఏంటంటే… పిని గ్రామం ఎప్పుడూ అత్యంత చల్లగా ఉంటుంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలే. ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది. అలాంటి చోట… బట్టలు లేకుండా నిమిషం ఉండటమే కష్టం. అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండటం అనేది కఠినమైన దీక్ష. అలాంటి దీక్ష ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందగలం అని స్థానికులు నమ్మకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular