Kerala: కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. కానీ కుక్క పని గాడిద గాడిద పని కుక్క చేస్తే ఫలితం వేరేలా ఉంటుంది. ఓ సందర్భంలో గాడిద అన్నదట కుక్కతో నువ్వు హాయిగా తింటున్నావు పడుకుంటున్నావు. నేనేమో బండెడు బట్టలు మోస్తూ చాకిరీ చే్స్తున్నానని వాపోయిందట. దీంతో కుక్క అయితే నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తానని ఒప్పందం చేసుకున్నాయట. అదే రోజు రాత్రి కుక్క పని గాడిద చేసేందుకు ఒప్పుకుని కాపలా కాస్తుందట. రాత్రి దొంగలు రావడంతో గాడిద ఒండ్రబెట్టింది. దీంతో యజమాని లేచి గాడిద నడుం విరగ్గొట్టాడు. దొంగలు మాత్రం ఉన్నదంతా దోచుకుపోయాట. అప్పుడు తెలిసింది గాడిదకు ఎవరి పనులు వారు చేస్తేనే మంచిదని.

సహజంగా ఆడవారికి ఓపిక చాలా ఉంటుంది. అందుకే వారిని భూదేవితో పోలుస్తుంటారు. సహనంలో వారిని భూతల్లితో కీర్తించడం సబబే.ఎందుకటే వారికి ఇంటిని చక్కదిద్దడంతో పాటు పిల్లలను కనే శక్తి కూడా ఆ భగవంతుడు ఇచ్చాడు. దీంతో వారు ఎంతో ఓర్పుతో ఉంటారు. పురిటినొప్పులు కూడా ఆడవారికి పునర్జన్మతో సమానం. అంత ప్రమాదం అని తెలిసినా తన మాతృత్వం అన్నింటిని త్యాగం చేస్తుంది. ఒక రకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి మరీ బిడ్డకు జన్మనిచ్చి కట్టుకున్న వంశాన్ని కాపాడుతుంది.
Also Read: Dream Job: ఏ పని చేయకుండానే అంత సంపాదనా?.. తెలిస్తే ఆశ్చర్యమే?
అంతటి మహత్తర శక్తి ఆమెలో దాగి ఉంది. అందుకే ఆమెను కార్యేషు దాసి కరణేషు మంత్రి భోర్జేషు మాతా శయణేషు రంభ అన్నారు. ఆమెలోని గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. కేరళలోని ఓ స్వచ్ఛంధ సంస్థ మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని మగవాళ్లకు కృత్రిమంగా కలిగించి వారి బాధలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. దీనికి వారు తట్టుకోవడం లేదు. మహిళలకు సహజంగా దేవుడు ఇచ్చిన వరమే ఓర్చుకోవడం. దీంతో వారు ఎంతటి నొప్పినయినా తేలికగా భరించడం వారినైజం.
ఎర్నాకులానికి చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ పురుషులకు పీరియడ్స్ నొప్పులు వస్తే ఎలా ఉంటుంది. వారు తట్టుకుంటారో అనే కోణంలో ఆలోచించి సిమ్యులేటర్ సిస్టమ్ ద్వారా మగవారికి కృత్రిమంగా పీరియడ్ నొప్పుల బాధలు అనుభవించేలా చేస్తున్నారు. దీంతో వారు విలవిలలాతున్నారు. మహిళలు ఆ నొప్పులు 9 దాటినా ఏ మాత్రం ఇబ్బందులు పడటం లేదు. కానీ పురుషులు మాత్రం నాలుగు దాటిందంటే గగ్గోలు పెడుతున్నారు. దీంతో దేవుడు సహజంగా ఇచ్చినవి కావడంతో వారికి భరించే శక్తి కూడా అలాగే ఉంటుంది.

కేరళలో బహిరంగంగా మహిళల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ స్వచ్చంధ సంస్థ ప్రయత్నిస్తోంది. పురుషుల్లో అవగాహన కలిగించేందుకు పాటుపడుతోంది. ఇందులో భాగంగానే మగవారికి ఆ సమస్యలు వస్తే తట్టుకుంటారా అని ప్రశ్నిస్తోంది. ఎవరు చేసే పని వారు చేస్తేనే బాగుంటుంది. ఒకరి పని ఒకరు చేస్తే ఇబ్బందులే వస్తాయనడంలో సందేహం లేదు. ఏ బాధలనైనా భరించే శక్తి ఆడవారికి మాత్రమే ఉంటుందని మనం గ్రహించుకుంటే ఎలాంటి సమస్యలు రావని సూచిస్తున్నారు.
Also Read:Avoid Health Problems: అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?