Ustaad Bhagat Singh Poster: ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదా..? హరీష్ శంకర్ భలే మోసం చేసాడు భయ్యా!

Ustaad Bhagat Singh Poster: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభం అయ్యింది. పది రోజుల పాటు సాగే ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో హాజరయ్యాడు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ మరియు పోలీస్ ఆఫీసర్ రెండు […]

Written By: Vicky, Updated On : April 6, 2023 10:40 am
Follow us on

Ustaad Bhagat Singh Poster

Ustaad Bhagat Singh Poster: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభం అయ్యింది. పది రోజుల పాటు సాగే ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో హాజరయ్యాడు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ మరియు పోలీస్ ఆఫీసర్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు.

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని సొంతంగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని డెవెలప్ చేసాడు.ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, పూజ హెగ్డే మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి, జనవరి 12 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

నిన్న షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా మేకర్స్ ఒక చిన్న పోస్టర్ ని విడుదల చేసారు,ఈ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ కుర్చీ వెనుకకి తిప్పి కూర్చొని ఒక చేతిలో టీ గ్లాస్ మరో చేతిలో గన్ పెట్టుకొని ఉంటాడు. ఫ్యాన్స్ ఈ పోజ్ ని చూసి మెంటలెక్కిపొయ్యారు.

Ustaad Bhagat Singh Poster

కానీ ఈ పోస్టర్ లో కనిపించేది పవన్ కళ్యాణ్ కాదని, డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ సోషల్ మీడియా లో కొంతమంది రూమర్స్ ప్రచారం చేసారు.కానీ ఆ సన్నని చేతులు ఆ సన్నని కాళ్ళు చూస్తే అర్థం చేసుకోవచ్చు అది పవన్ కళ్యాణ్ అని,ఇద్దరి హెయిర్ స్టైల్ ఒకేలా ఉండడం వల్ల ఈ అయ్యోమయ్యం ఏర్పడింది అని అంటున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా నిన్న వచ్చిన ఈ అనౌన్స్మెంట్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు.