Unstoppable Pawan Kalyan : కోట్లాది మంది అభిమానులు – ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం ఇటీవలే ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అయ్యింది.. ఈ ఎపిసోడ్ కి కనీవినీ ఎరుగని రేంజ్ లో వ్యూస్ వచ్చాయని ఆహా మీడియా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.. ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ అప్పుడు సర్వర్స్ తట్టుకోలేక బ్లాస్ట్ అవ్వడంతో చాలాసేపటి వరకు యాప్ లైవ్ కాలేదు.
దీంతో ఆ ఎపిసోడ్ మొత్తం టెలిగ్రామ్ లో లీక్ అయ్యిపోవడంతో ఆహాలో ఆ ఎపిసోడ్ కి రావాల్సిన వ్యూస్ రాక కాస్త నిరాశకి గురవ్వాల్సి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సర్వర్స్ కెపాసిటీ బాగా పెంచారు.. రికార్డు స్థాయిలో యూజర్లు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ఆహా యాప్ టీం బ్యాకప్ లో మూడు సర్వర్స్ ని కూడా రెడీగా పెట్టుకున్నాయి.
అయినప్పటికీ కూడా రికార్డు స్థాయిలో యూజర్లు రావడంతో ఆహా యాప్ కొద్దిసేపటి వరకు ఆఫ్ లైన్ అయ్యింది.. అంటే దీనిని బట్టి ఏ రేంజ్ లో వ్యూస్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.. అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం ఈ ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి వచ్చిన లాభం అక్షరాలా పాతిక కోట్ల రూపాయిలపైమాటే అట.. ఇది కేవలం ఆహా మీడియా హిస్టరీ లోనే కాదు, ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే ఆల్ టైం సెన్సేషనల్ రికార్డుగా చెప్తున్నారు ఆహా మీడియా టీం. అంతే కాకుండా ప్రభాస్ ఎపిసోడ్ కి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరకు లాభాలు వచ్చాయట.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన రెండో భాగం ఇంకా మిగిలే ఉంది.. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చెయ్యగా మొదటి ఎపిసోడ్ కంటే రెండవ ఎపిసోడ్ ఇంకా ఆసక్తికరంగా సాగబోతోంది అనే విషయం అర్థం అవుతుంది..చూడాలిమరి ఈ ఎపిసోడ్ కూడా మొదటి ఎపిసోడ్ లాగానే రికార్డ్స్ నెలకొల్పుతుందో లేదో అనేది.