Akhira Nandan : హైదరాబాద్ లో నేడు ‘ఫార్ములా ఈ’ సందర్భంగా ఒక కార్ రేస్ పోటీ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే..ఈ పోటీ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు సెలెబ్రిటీలందరూ హాజరయ్యారు..వారితో పాటుగా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మరియు మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా హాజరయ్యారు.వాళ్లకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.
అకిరా నందన్ ని చూస్తూ ఉంటే టీనేజ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో అలానే ఉన్నట్టు కనిపిస్తుంది..ఫ్యాన్స్ అకిరా నందన్ ని చూసి ఎంతగానో మురిసిపోతున్నారు.ఇది వరకు కూడా అకిరా నందన్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మరియు జిమ్ వీడియోలు సోషల్ మీడియా లో చాలానే అప్లోడ్ చేసింది అతని తల్లి రేణు దేశాయ్.అవి చూసి అకిరా నందన్ టాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అని అడిగేవారు ఫ్యాన్స్.
కానీ రేణు దేశాయ్ మాత్రం అకిరా కి సినిమాలు అంటే ఇష్టం లేదని, వాడికి మ్యూజిక్ మీదనే ఎక్కువ ఆసక్తి అంటూ చెప్పుకొచ్చేది.కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు అలానే అనుకుంటారు కానీ భవిష్యత్తులో మాత్రం అకిరా నందన్ కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడు అని అంటున్నారు..మరో వైపు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కి మొత్తం సిద్ధం అయ్యిందని, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఖరారు అయ్యిందని వార్తలు వినిపించాయి.
దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు కానీ, భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నాయి కొన్ని విశ్వసనీయ వర్గాలు..చూడాలిమరి అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది.
https://twitter.com/AjayPa1ist/status/1624414797814202370?s=20&t=83_kro4NfetLqsZ5zvF0RQ