
Actor Suman- Pawan Kalyan: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన క్లిక్ అయిన నేతలు అరుదు. ఇప్పుడు వారి సరసన పవన్ కల్యాణ్ చేరిపోయారు. కొందరితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అశేష సైనికులను సంపాదించిపెట్టుకున్నారు. ఆయన ఎక్కడ సభ పెట్టినా సీఎం కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. ఆయన స్థితికి రావడానికి ఎంతో కష్టపడ్డారనడంతో సందేహం లేదు. తాజాగా నటుడు సుమన్ కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు పలికారు. తన మనసులోని మాటను బయటపెట్టారు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో దీనిపై అనేక కథనాలు వినిపించాయి. సీనియర్ నటుడు సుమన్‌కు చిరంజీవి ఫ్యామిలితో గొడవలు ఉన్నాయనే టాక్ మొదటి నుంచి నడుస్తుంది. ఈ విషయంలో చిరంజీవి, సుమన్ స్పందించలేదు. చివరికి అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. చాలా సందర్భాల్లో ఇద్దరు మంచి స్నేహితులని సుమన్ చెప్పి అందరి నోళ్లను మూయించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పొలిటికల్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చిన సుమన్ తన అభిమాన సంఘంతో ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో వపన్ రాజకీయ జీవితంపై మాట్లాడారు. పవర్ స్టార్ నుంచి జనసేనాని అని పవన్ పిలుపించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాల్లో ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని అన్నారు.

సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలోనైనా ఆయనకు అభిమానులు ఉన్నారని సుమన్ చెప్పుకొచ్చారు. దేవుడు ఏది స్క్రిప్ట్ రాస్తే అదే జరుగుతుందని అన్నారు. ఎప్పటికైనా పవన్ సీఎం అవుతారని అన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని సరిపోవాలని అన్నారు. కుల, మత రహిత పాలన కావాలని ఆశిస్తున్న వారిలో పవన్ కల్యాణ్ ఒకరేనని వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.