
PKSDT Movie Teaser: ఈమధ్యనే ప్రారంభమైన పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ చిత్రం అప్పుడే షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ చిత్రాన్ని జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. ఈ 30 రోజుల కోసం ఆయన దాదాపుగా 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. ఆయన లుక్స్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉండనున్నాయి. రీసెంట్ గా లొకేషన్ నుండి లీకైన కొన్ని ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్ చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్ తో పాటు యాక్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందట.
ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇక నుండి నాన్ స్టాప్ గా ఉంటాయని, మూవీ టీం నిన్న అధికారికంగా చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ముందుగా ఈ నెల 30 వ తారీఖున ఒక చిన్న గ్లిమ్స్ ని విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఈ గ్లిమ్స్ తో పాటుగా మూవీ టైటిల్ ని కూడా ప్రకటిస్తారట.

ఈ సినిమాకి టైటిల్స్ ‘దేవర’ లేదా ‘దేవుడే దిగి వచ్చినా’ వంటి టైటిల్స్ ని పెట్టడానికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. జులై 28 వ తారీఖున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి పూనకాలే, స్క్రిప్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో కూడా ఎమోషనల్ డ్రామా అంటున్నారు. చూడాలి మరి ఈ మామ – అల్లుడి కాంబినేషన్ ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేదా అనేది.