https://oktelugu.com/

Pawan Kalyan New Look : అదిరిపోయిన పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. తట్టుకోలేరంతే

Pawan Kalyan New Look : అందరు హీరోలు ఒక ఎత్తు.. పవన్ కల్యాణ్ మరో ఎత్తు. పవన్ రాజకీయ రంగంలోకి వెళ్లాక కాస్త స్టైల్ తగ్గించాడు కానీ.. ఆయన సూటు బూటు వేసుకుంటే అదిరిపోయేలా ఉంటాడు. కానీ ఎప్పుడూ తెల్లటి చొక్కా పైజామా వేసుకొని సాదాసీదాగా కనిపిస్తారు. ప్రస్తుతం పవన్ రెండు పడవల ప్రయాణంతో చాలా బిజీగా ఉన్నారు. ఇటు రాజకీయాలతోపాటు వరుస సినిమాల షూటింగ్స్ తో పవన్ బిజిగా ఉంటున్నారు. తాజాగా మేనల్లుడు సాయిధరమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2023 / 11:55 AM IST
    Follow us on

    Pawan Kalyan New Look : అందరు హీరోలు ఒక ఎత్తు.. పవన్ కల్యాణ్ మరో ఎత్తు. పవన్ రాజకీయ రంగంలోకి వెళ్లాక కాస్త స్టైల్ తగ్గించాడు కానీ.. ఆయన సూటు బూటు వేసుకుంటే అదిరిపోయేలా ఉంటాడు. కానీ ఎప్పుడూ తెల్లటి చొక్కా పైజామా వేసుకొని సాదాసీదాగా కనిపిస్తారు. ప్రస్తుతం పవన్ రెండు పడవల ప్రయాణంతో చాలా బిజీగా ఉన్నారు.

    ఇటు రాజకీయాలతోపాటు వరుస సినిమాల షూటింగ్స్ తో పవన్ బిజిగా ఉంటున్నారు. తాజాగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమా ‘వినోదయ సీతం’ రిమేక్ మొదలైంది. ఆ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఫొటోలు రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి.

    ఈ సినిమా షూటింగ్ లో పవన్ కు సంబంధించిన ఫొటోలు రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ‘బ్లాక్ హుడీ, ఖాకీ రంగు ప్యాంట్ లో పవన్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ తో సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నయా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్షేషనల్ గా మారింది.

    పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో కూర్చీలో కూర్చున్న మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొడ మీద కాలు పెట్టి భుజంపై చేయి వేసి ఆహ్లాదంగా ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటో తెగ వైరల్ అయ్యింది. మెగా అభిమానులంతా ఈ మామ అల్లుళ్ల ప్రేమకు మురిసిపోతున్నారు.

    https://twitter.com/peoplemediafcy/status/1628251702104293376?s=20