Pawan Kalyan : ఆమె కోసం ముంబై వీధుల్లో కొట్లాడుతున్న పవన్ కళ్యాణ్..షాక్ లో ఫ్యాన్స్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న చిత్రం #OG.యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 16 వ తారీఖు నుండి ముంబై లో జరగనుంది.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా పాల్గొనబోతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద ఒక భారీ […]

Written By: NARESH, Updated On : ఏప్రిల్ 12, 2023 8:37 సా.
Follow us on

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న చిత్రం #OG.యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 16 వ తారీఖు నుండి ముంబై లో జరగనుంది.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా పాల్గొనబోతుంది.

ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్.ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలక ఘట్టం లో విలన్స్ నుండి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని రక్షించే సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు.ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ కొనసాగనుంది.ఇక ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందే సుజిత్ మరియు మూవీ టీం కలిసి ముంబైలోని కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు.ఇప్పుడు ఆ లొకేషన్స్ లోనే షూటింగ్ చెయ్యబోతున్నారు.పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ వదిలి ఒక సినిమా కోసం పక్క రాష్ట్రం లోకి అడుగుపెట్టబోతున్నాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి #OG అనే టైటిల్ నే ఖాయం చేసుకున్నట్టు తెలుస్తుంది.అన్నీ బాషలలో ఇదే టైటిల్ ఉండబోతుందట.

ఈ చిత్రం లో మరో హీరో కూడా నటించేంత స్కోప్ ఉంది, తమిళం లో గత ఏడాది విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఆ తరహాలో యాక్షన్ సినిమాగా #OG ఉంటుందట.పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చే డైరెక్టర్ సుజిత్, తన అభిమాన హీరోకి ఎలాంటి మరపురాని బ్లాక్ బస్టర్ ఇస్తాడో చూడాలి.యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి ఈ మూవీ కి హిందీ లో కూడా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.