Pawan Kalyan Hanuman Video Viral : సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ పై సినిమాల ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఈ సమంలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న సినిమాలను వాయిదా వేసుకోవడం లేదా ముందే రిలీజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రశాంత్ వర్మడైరెక్షన్లో వచ్చిన‘హనుమాన్’సినిమా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిని తట్టుకొని థియేటర్లోకి వచ్చింది. అనుకున్నట్లుగానే సినిమా బంపర్ హిట్టు కొట్టింది. రోజురోజుకు హనుమాన్ సినిమాకు క్రేజ్ పెరగడమే గానీ తగ్గడం లేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తి చర్చ సాగుతోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. పవన్ సినిమాలతో సందడి చేస్తున్నారు. ఆయన సినిమాలు ఎప్పటికీ ట్రెండీగా నిలుస్తాయి. పవన్ సైతం వరుసబెట్టి సినిమాలు తీస్తున్నాడు. తాజాగా పవన్ ఇటీవల రిలీజ్ అయిన ‘హనుమాన్’ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? అని ఓ వీడియోను తయారు చేశారు. అంటే హునుమాన్ సినిమాకు సంబంధించిన వీడియోలో పవన్ ఫొటోలను చేర్చారు. ఏమాత్రం.. ఎక్కడా తేడా రాకుండా ఉన్న ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో నెట్టింటా వైరల్ కావడంతో చివరికి హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఈ వీడియో చాలా బాగుంది అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. దీంతో పవన్ కల్యాణ్ తో ఇలాంటి సినిమా తీయాలని కోరుతున్నారు. అయితే దీనిపై మాత్రం ప్రశాంత్ వర్మ స్పందించలేదు. కానీ పవన్ ఇలాంటి సినిమాలో కనిపిస్తే అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Exactly which traits of Lord Hanuman does pawan kalyan hold?
1. Brahmacharya ❌️
2. Grace ❌️
3. Truthful ❌️
4. Loyalty ❌️
5. Dharma ❌️
6. Selflessness ❌️
7. Leadership ❌️
8. Virtuous ❌️ https://t.co/wrZDYanc7J— Rise Of YSJagan (@RiseofYSJagan) January 28, 2024