Pawan Kalyan
Pawan Kalyan : రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్ట్ టైంగా సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఆయనతో ఒక చారిత్రక సినిమాను నిర్మించడమే పెద్ద తప్పు. కమర్షియల్ సినిమాలే కనీసం ఆరు నెలల్లో తీస్తున్న రోజులివీ. అలాంటి పవన్ తో ‘హరిహర వీరమల్లు’ లాంటి చారిత్రక వీరుడి కథకు పూర్తి న్యాయం చేయాలంటే ఎంతలేదన్న ఒక సంవత్సరం అన్నా టైం కావాలి. అదే ఇప్పుడు గుదిబండగా మారింది. ఆ నిర్మాత పుట్టిముంచేలా కనిపిస్తోంది.
ఇప్పటికే హరిరహర వీరమల్లు సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యింది. ఇక 40 శాతం ఉండగా పవన్ కళ్యాణ్ పక్కనపెట్టి తన ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత ఏఎం రత్నం ఇప్పుడు అప్పులు తెచ్చి కుప్పగా మారిన వాటిని చూసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒకప్పుడు భారీ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఏఎం రత్నం ఇదే పవన్ తో కలిసి ‘ఖుషీ’ సినిమా నిర్మించాడు. అలాంటి రత్నం ఇప్పుడు పూర్తిగా అప్పులపాలయ్యాడు. పవన్ సినిమా చేస్తేనే అతడు బతికేటట్టు ఉన్నాడట.. ఇటు ఆర్థిక సమస్యలు.. అటు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లును’ పక్కనపెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా ఏఎం రత్నంకు తీపివార్తను అందించాడట..
పవన్ కళ్యాన్ కు ఇప్పుడు టైం లేదు. ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ దసరా నుంచి ఆయన ప్రజల్లోకి బస్సు యాత్రతో వెళుతున్నారు. దసరాలోపే ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు మూడు ఉన్నాయి.అందులో హరిహర వీరమల్లను పక్కనపెట్టినట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ‘హరిహర వీరమల్లు’ సినిమాను తాను పూర్తి చేస్తానని నిర్మాతకు హామీ ఇచ్చినట్లు సమాచారం.ఈ సినిమాపై ఏఎం రత్నం భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికే ఎంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును పక్కనపెడితే కనుక రత్నం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాడు. అందుకే వచ్చే నెలలో షూటింగ్ పూర్తి చేస్తానని జనసేనాని పవన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.
కానీ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని ఏపీ రాజకీయ పరిణామాలు నిర్మాత ఏఎం రత్నంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్యాకప్ చెప్పి తన సినిమా పూర్తి చేయకుండా వెళుతాడేమోనని హడలి చస్తున్నాడట.. మరి అన్న టైంకు ‘హరిహర వీరమల్లు’ సినిమా పవన్ పూర్తి చేస్తాడా? లేదా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.