Pawan Kalyan Unstoppable: అటు సినీ అభిమానులు ఇటు రాజకీయ నాయకులూ ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అతి త్వరలోనే ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ ని ఈ నెల 26 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చెయ్యగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ రావడం సర్వ సాధారణమే..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన 20 ఏళ్ళ సినీ కెరీర్ లో పాల్గొన్న ఏకైక టాక్ షో ఇది మాత్రమే..బాలయ్య బాబు ప్రేమతో ఆహ్వానించడం తో కాదనలేక ఈ షోలో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్..అయితే నిన్న విడుదల చేసిన టీజర్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడిగిన కొన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ మన అందరికీ తెలిసిందే..కానీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఒకసారి ఓడిపోవాల్సి వచ్చింది..ఇదే విషయం పై బాలయ్య ప్రశ్న అడుగుతూ ‘ఈ రాష్ట్రము లో నీ ఫ్యాన్ కానీ వాడంటూ ఉండదు..కానీ ఆ అభిమానం మొత్తం ఓట్ల రూపం లో మారలేదు..దీనికి కారణం మీరేమి చెప్తారు’ అని అడుగుతాడు బాలయ్య..దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏమిటో తెలియాలంటే 26 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే

.అయితే ఈ షో కి వెళ్లిన వాళ్ళు ఆ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం ఇచ్చాడో సోషల్ మీడియా లో లీక్ చేసేసారు..’రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు అనుభవం గల నాయకుడు రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు చేశాను..వైసీపీ వాళ్ళు దానిని తప్పుగా ప్రాజెక్ట్ చెయ్యడం వల్ల.. తెలుగు దేశం పార్టీ కి ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ ఉండడం తో దాని ప్రభావం టీడీపీ తో పాటు మా పార్టీ కి కూడా ఎఫెక్ట్ పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు అంటున్నారు ఈ షోకి వెళ్లి చూసినవాళ్లంతా .