Kushi Movie Re Release Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ ని నూతన సంవత్సరం సందర్భం గా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31 వ తారీఖున విడుదలకి సిద్ధం గా ఉంది..ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..ఇది గమనించిన ఆ చిత్ర నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని లేటెస్ట్ 4K క్వాలిటీ కి మార్చి, డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది..ఇంత మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రీ రిలీజ్ అవుతున్న చిత్రానికి జరగడం ఇదే తొలిసారి..’బుక్ మై షో’ లో కూడా ఈ చిత్రం లేటెస్ట్ రిలీజ్ మూవీస్ మరియు ‘అవతార్ 2’ వంటి చిత్రాలను కూడా అధిగమించి టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ చిత్ర నిర్మాతలు సరిగా చెయ్యడం లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో వాపోతూ వస్తున్నారు..వాళ్లకి ఉపశమనం కలిగిస్తూ నేడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు..నిమిషానికి పైగా వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ కట్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పిక్చర్ క్వాలిటీ కూడా అదిరిపోయింది..వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్ ని అంత క్వాలిటీ వీడియో లో చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు..ఎలాంటి అలర్ట్స్ లేకుండా సడన్ గా విడుదల చేసిన కూడా ఈ ట్రైలర్ రీచ్ అదిరిపోయింది.

నిమిషాల వ్యవధి లోనే వేల కొద్దీ లైక్స్ మరియు లక్షల్లో వ్యూస్ వచ్చాయి..ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపు లేదా 27 వ తారీఖున ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది..ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో జల్సా నే అత్యధిక వసూళ్లతో టాప్ 1 స్థానం లో ఉంది..ఈ సినిమా కి దాదాపుగా 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..దీనిని ఖుషి సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
