Khushi Re Release Collections: ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘జల్సా’ మూవీ స్పెషల్ షోస్ ని వెయ్యగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..770 షోస్ కి గాను మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇప్పటి వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ..ఈ రికార్డుని మాత్రం ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు.

ఇక డిసెంబర్ 31 వ తేదీన పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన ఇండస్ట్రీ హిట్ ‘జల్సా’ మూవీ ని రీ రిలీజ్ చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో కొన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి..ఈ చిత్రం జల్సా మూవీ రికార్డ్స్ ని చాలా తేలికగా బద్దలు కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్..అందుకే తగ్గట్టుగానే ఆస్ట్రేలియా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి.
ఆస్ట్రేలియా లో ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మెల్బోర్నే లో ప్రారంభించారు..రెండు షోస్ కి గాను $2400 ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చాయి..అంతే కాకుండా సిడ్నీ లో గత రెండు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు..ఆ లొకేషన్ కి సంబంధించిన గ్రాస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..ఇంకా షోస్ పడడానికి 5 రోజుల సమయం ఉన్నందున విడుదల సమయానికి కచ్చితంగా జల్సా మూవీ రికార్డు ని బద్దలు కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

జల్సా మూవీ ఇక్కడ సుమారు గా పది వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేసింది..ఆ ప్రాంతం లో ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇంకా కొన్ని షోస్ అదనంగా యాడ్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది.