Pawan Kalyan- Sujeeth: టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉండే అగ్రహీరో ఎవరంటే అది పవన్ కళ్యాణ్ యే. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తున్నారు. జనసేన రాజకీయం నడిచేదే పవన్ కష్టపడి తీసే సినిమాలకు వచ్చిన డబ్బుతో. ఎందుకంటే జనసేనలో బడబాబులు లేరు. పారిశ్రామికవేత్తలు లేరు. ఫండ్స్ ఇచ్చే వారు లేరు. అంతా పవన్ కష్టార్జితం. అందుకే సినిమాల్లో వచ్చిన కోట్ల డబ్బును ఏపీలో కౌలురైతులు, ఇప్పటం బాధితులు ఇలా ఎవరు ఆపదలో ఉన్నా లక్షలు కాదనకుండా ఇచ్చేస్తున్న గొప్పమనసు పవన్ కళ్యాణ్ ది.

అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ తో ‘భవదీయ భగత్ సింగ్ ’ ఉంది. ఇక మధ్యలో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కూడా ‘వినోదయ సీతం’ రిమేక్ చేయాల్సి ఉంది.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను వేసవిలోపు పూర్తి చేసి ఎన్నికలకు ఏడాది ముందు సమర శంఖం పూరించాలి. అందుకే ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ పూర్తి చేసే పనిలో పవన్ బిజిగా ఉన్నారు. ఆ తర్వాత వీలును బట్టి హరీష్ శంకర్, సాయిధరమ్ తో మూవీ పూర్తి చేస్తారు.
మరి ఇంత టైట్ షెడ్యూల్ లో తాజాగా సుజీత్ దర్శకత్వంలో మరో కాన్సెప్ట్ మూవీని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూడు సినిమాలే పూర్తికాలేదు. ఆ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారన్న డౌట్ అందరిలోనూ ఉంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమాలో దర్శకుడు సుజీత్ ఒక సూపర్ కథను తయారు చేశాడని.. అదిరిపోయేలా దీన్ని రూపొందించబోతున్నాడని సమాచారం.

ఇటీవల విడుదలైన పోస్టర్ చూస్తే ఇది ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీ అని అర్థమవుతోంది. అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కే చిత్రం. జపాన్, ముంబై దేశాలు కథలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి సుజీత్ హీరో పవన్ కళ్యాణ్ ని సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నాడని స్పష్టం అవుతుంది. ఇదివరకు ఎన్నడూ పవన్ ను చూడని పాత్రలో చూపించబోతున్నాడు.. పాన్ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారట.. స్వతహాగా పవన్ ఫ్యాన్ అయిన దర్శకుడు సుజీత్ అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే తన మార్క్ చూపించాడు. సినిమాపై అంచనాలు పెంచేశాడు. అందుకే ఈ అద్భుతమైన కథను ఎలాగైనా తీయాలని పవన్ ఓకే చేసినట్టు తెలిసింది. దీనికి డేట్స్ ఎప్పుడు ఇస్తాడు? ఎలా పూర్తి చేస్తాడన్నది వేచిచూడాలి.