
Pawan Kalyan- Trivikram: పవన్ ఫాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్న ప్రాజెక్ట్ వినోదయ సితం. ప్రాజెక్ట్ చేయవద్దు అన్నయ్య అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభ్యర్థనలు వినిపిస్తున్నారు. తమిళ హిట్ మూవీ అయిన వినోదయ సితం పవన్ ఇమేజ్ కి ఏమాత్రం సరిపోయే కథ కాదని వారి అభిప్రాయం. వినోదయ సితం లో ప్రధాన పాత్ర చేసింది సముద్ర ఖని, తంబి రామయ్య. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ చేసిన కథ ఒక స్టార్ హీరోకి ఏ విధంగా సరిపోదని వారి ఆలోచన. అలాగే గతంలో ఇదే తరహా చిత్రం పవన్ చేసి ఉండరు. వెంకటేష్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ గోపాలా గోపాలా మూవీలో ఇదే షేడ్స్ ఉంటాయి.
కాబట్టి వినోదయ సితం వద్దంటారు. అయితే వాళ్లకు గుడ్ న్యూస్. వినోదయ సితం రీమేక్ బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకున్నారు. దర్శకుడిగా కాదు రచయితగా. ఒరిజినల్ చిత్రానికి దర్శకుడిగా ఉన్న సముద్ర ఖని ఈ రీమేక్ తెరకెక్కిస్తున్నారు. అయితే స్క్రిప్ట్ సిద్ధం చేసింది మాత్రం త్రివిక్రమ్. ఈ విషయంలో త్రివిక్రమ్ ఎక్సపర్ట్. భీమ్లా నాయక్ విషయంలో ఆయన పనితీరు చూశాము. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కి పవన్ కోసం ఆయన ఇచ్చిన అప్డేషన్, మార్పులు చేర్పులు అదిరిపోయాయి. పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ కలిగేలా భీమ్లా నాయక్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
వినోదయ సితం స్క్రిప్ట్ కి కూడా మార్పులు చేర్పులు చేసింది త్రివిక్రమే. కేవలం స్టోరీ లైన్ తీసుకొని మొత్తం మార్చేశారట. పవన్ నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వినోదయ సితం మూవీలో ఉండనున్నాయట. కాబట్టి పవన్ కెరీర్లో మరో సూపర్ హిట్ మూవీగా వినోదయ సితం రీమేక్ నిలిచిపోనుంది అంటున్నారు. ఈ నెలాఖరున వినోదయ సితం రీమేక్ షూట్ ప్రారంభం కానుంది అంటున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ 20 నుండి 25 రోజుల కాల్షీట్స్ కేటాయించాడట. అనుకున్న ప్రకారం జరిగితే ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల కానుంది. కాగా హరి హర వీరమల్లు షూట్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు సుదీప్ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వీటితో పాటు దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించారు.