https://oktelugu.com/

Pawan – Ramcharan Fans : పవన్-చరణ్ ఫ్యాన్ వార్… కుట్రలో భాగమేనా? దీని వెనకుంది ఎవరు?

Pawan Ramcharan Fans : రెండు రోజులుగా పవన్ కళ్యాణ్,  రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవలు చూసి కామన్ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు. చరణ్ కంటే పవన్ గొప్పని ఒకరు కాదు పవన్ కంటే చరణ్ గొప్పంటూ మరొకరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి నట వారసులుగా పరిశ్రమకు పరిచయమైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ టాప్ స్టార్స్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2023 / 03:08 PM IST
    Follow us on

    Pawan Ramcharan Fans : రెండు రోజులుగా పవన్ కళ్యాణ్,  రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవలు చూసి కామన్ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు. చరణ్ కంటే పవన్ గొప్పని ఒకరు కాదు పవన్ కంటే చరణ్ గొప్పంటూ మరొకరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి నట వారసులుగా పరిశ్రమకు పరిచయమైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ టాప్ స్టార్స్ గా ఎదిగారు. చిరంజీవి అనే ధైర్యం ఉన్నప్పటికీ స్టార్ గా ఎదగడంలో వారి ప్రతిభ దోహదం చేశాయి. వారసులు కావడం వలన స్టార్స్ కాలేరు. అది చాలా మంది విషయంలో నిరూపితమైంది.

    పవన్, చరణ్ ఇద్దరూ ప్రతిభ గల హీరోలు. తమకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవే వాళ్లను స్టార్స్ చేశాయి. అశేష అభిమాన గణాన్ని తెచ్చిపెట్టాయి. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ అనవసరం. అదే సమయంలో పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ మధ్య ఎంతటి ఆప్యాయత ఉందో తెలిశాక ఈ డిబేట్లు పెట్టడం టైం వేస్ట్. బాబాయ్ స్టార్ డమ్ చరణ్ కి స్ఫూర్తి పంచితే… చరణ్ ఎదుగుదల చూసి పవన్ మురిసిపోతారు. చిన్నప్పటి నుండి చరణ్ ని తన చేతుల్లో ఎత్తుకొని పెంచానని పవన్ ఇటీవల చెప్పారు.

    నేను పబ్లిక్ లో వాంతి చేసుకుంటే బాబాయ్ పవన్ అదంతా ఒక తల్లి మాదిరి శుభ్రం చేశాడని చెప్పారు. బాబాయ్-అబ్బాయ్ ల మధ్య ఇంతటి గొప్ప అనుబంధం ఉందని తెలిసి కూడా ఫ్యాన్ వార్స్ నిరర్ధకం. చిరంజీవి లెగసీని ముందు తీసుకెళ్లిన పవన్, చరణ్ ఆయన గర్వపడేలా చేశారు. పవన్-చరణ్ లలో ఎవరు గొప్ప అనే చర్చ నిరర్ధకం అంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్ధులు తెలివిగా సృష్టిస్తున్న అంతఃకలహాలు అంటున్నారు. ఈ కుట్రల విషయంలో మెగా అభిమానులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.

    జనసేన పార్టీ ప్రజల్లోకి దూసుకెళుతుండగా… పవన్ ని దెబ్బతీసే కుట్ర కావచ్చు అంటున్నారు. మెగా అభిమానుల ముసుగులో గొడవలు రేపి పవన్ కి చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ అభిమానులను దూరం చేసే ప్రణాళికలు కావచ్చు అంటున్నారు. విజ్ఞత కలిగిన మెగా అభిమానులు రామ్ చరణ్, పవన్ ఫ్యాన్స్ సంయమనం పాటించాలి అంటున్నారు. ఇకనైనా ఈ ఫ్యాన్ వార్ కి తెరదింపాలంటున్నారు. గతంలో రామ్ చరణ్-అల్లు అర్జున్, అల్లు అర్జున్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ చోటు చేసుకున్నాయి.