
Pathan Collections: గత కొంతకాలం నుండి సరైన హిట్స్ లేక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎంత దయనీయమైన పరిస్థితి లో ఉన్నిందో మన అందరికీ తెలిసిందే.బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు కలెక్షన్స్ పరంగా కంటెంట్ పరంగా ఇరగదీసాయి.ఇక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హవానే ఉంటుంది, బాలీవుడ్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నటున్న సమయం లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి హిందీ సినిమాకి పూర్వ వైభవం తీసుకొచ్చాడు.
జీరో వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత 5 ఏళ్ళ వరకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన షారుఖ్ ఖాన్, ప్రముఖ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో కలిసి చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి కాసుల కనకవర్షం కురిసింది.మొదటి రోజు నుండి నేటి వరకు ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ 26 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ 26 రోజులకు గాను ఈ సినిమా అన్ని భాషలకు కలిపి 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.ఇది వరకు సౌత్ సినిమాలైనా బాహుబలి 2 , KGF 2 మరియు #RRR వంటి సినిమాలు మినహా ఒక్క బాలీవుడ్ మూవీ కూడా ఈ మార్కుని అందుకోలేదు.కానీ పఠాన్ చిత్రం అతి తేలికగా ఆ మార్కుని దాటి చరిత్ర సృష్టించింది.#RRR సినిమాకి అన్ని భాషలకు కలిపి సుమారుగా 1200 కోట్ల రూపాయిలను వసూలు చేసింది.పఠాన్ చిత్రం ఆ వసూళ్లను దాటుతుందా లేదా అనేది చూడాలి.

కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతున్న సినిమా కాబట్టి కచ్చితంగా #RRR ని కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఓవర్సీస్ లో ఒక్క అమెరికా తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాలలో ఈ చిత్రం ఇండియన్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేసింది.అక్కడ ఈ వారం తో దాదాపుగా రన్ క్లోజ్ అయ్యిపోయినట్టే, కానీ మన దేశం లో ఇంకా మూడు వారాల రన్ వచ్చేలా ఉంది.ఈ మూడు వారాల్లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.
