Pastor Mesala Gurrappa: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక పాట తెగ వినిపిస్తోంది. అదేమన్నా గొప్పదా? అద్భుతమైన సాహిత్య విలువలు ఉన్నదా? పదబంధాలు బలంగా ఉన్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లేదు అని మాత్రమే చెప్పొచ్చు. కానీ ఎందుకు అంతలా అది ఈ స్థాయిలో జనాదరణ పొందింది.. అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించడం కష్టం.
గత ఏడాది ఓ ముసలి వ్యక్తి కూర్చి మడతపెట్టి అని అనగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. గుంటూరు కారం సినిమాలో కుర్చి మడత పెట్టి పేరుతో ఏకంగా ఒక పాటనే రాశారు. మహేష్ బాబు, శ్రీ లీల ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. యూట్యూబ్లో అది నెంబర్ వన్ సాంగ్ గా రికార్డు సృష్టించింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త ఘనతను లిఖించింది. ఇప్పుడు అదే స్థానంలో కోయారో కోయ అనే పాట నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాట సృష్టిస్తున్న సంచలనం అలాంటిది మరి.
పాడింది ఎవరంటే
కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని ఓ వృద్ధుడు అంటే.. కోయారే కోయ అనే పాటను పాస్టర్ గురప్ప పాడాడు. ఇందులో పదాల కల్పన.. పాడిన తీరు చిత్రంగా ఉంటుంది.. “కోయారే కోయ.. కోయారే కోయ.. మామారే చందమామ.. అన్ని బందూరే.. అన్ని బందూరే” ఇలా చిత్రమైన పదాలతో ఈ పాట పాడారు పాస్టర్ గురప్ప. ఆయన ఏ సందర్భంలో పాడారో తెలియదు కానీ.. ఇప్పటికైతే సోషల్ మీడియాను ఊపేస్తోంది. రీల్స్ లో తెగ దర్శనమిస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్.. ఇలా అన్నింట్లోనూ ఈ పాటదే అగ్రస్థానం. ఇప్పుడు తెలుగు సినిమా మొత్తం సోషల్ మీడియాను నమ్ముకొని ప్రయాణం సాగిస్తోంది కాబట్టి.. ఈ పాట విశేషమైన ప్రజాదరణ పొందింది కాబట్టి.. గతంలో కుర్చీ మడత పెట్టి పాట సరికొత్త రికార్డు సృష్టించింది కాబట్టి.. కోయారే కోయ ను సినిమా పాటగా రూపొందిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకీ ఈ పాటకు అర్థం పాడిన గుర్రప్ప కూడా చెప్పలేదు. అదే విషయాన్ని కొంతమంది అడిగితే.. త్వరలోనే వెల్లడిస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు అతడు ఆ దిశగా అడుగులు వేయలేదు. బహుశా ఈ పాట పాడిన గురప్ప కూడా ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని అనుకుని ఉండడు.. అయినా నేటి సోషల్ మీడియా కాలంలో ఏది జనాదరణ పొందుతుందో.. ఏది విస్తృతంగా దర్శనమిస్తుందో.. ఏది కోట్లాది వీక్షణలు సొంతం చేసుకుంటుందో..ఎవరూ చెప్పలేకపోతున్నారు.. కానీ ఇక్కడ సామాన్యులు ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. దానికి కారణం సోషల్ మీడియా అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాళ్లలో ఉన్న ఏదైనా టాలెంట్ ఈ వేదికల ద్వారా బయటికి వస్తోంది. అది అంతిమంగా ప్రజలకు చేరువ అవుతోంది.
గత ఏడాది విడుదలైన గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి పాట నెంబర్ వన్ లో ట్రెండ్ అయింది.. గత వారం రోజులుగా “కోయారే కోయ్” అని పాస్టర్ మీసాల గుర్రప్ప పాడిన పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది కూడా సినిమా పాటగా రూపొందే అవకాశం ఉంది. #koyarekoyi#meesalagurappa pic.twitter.com/iDMipKxn9t
— Anabothula Bhaskar (@AnabothulaB) January 2, 2025