Owls: గుడ్లగూబ అనగానే.. రాత్రి వేళ మాత్రమే వింత శబ్దాలు చేస్తాయని మనందరికీ దెలుసు.. అవి రాత్రివేళల్లోనే తిరుగుతుంటాయి. కానీ, బీహార్‌లోని సీవాన్ జిల్లాలో అరుదైన జాతికి చెందిన గుడ్ల గూబలు కనిపించాయి. ఇవి.. నాగుపాములా బుసలు కొడుతున్నాయి. ఈ వింత గుడ్లగూబలను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.
మూసి ఉన్న గదిలో ప్రత్యక్షం..
బీహార్‌లోని విస్వార్ గ్రామానికి చెందిన మనన్‌సింగ్ ఇంట్లో ఓ గది చాలాకాలంగా మూసి ఉంది. ఇటీవల ఆ గదిని మనన్‌సింగ్ తెలిరిచాడు. లోపలికి వెళ్లగానే పాములు బుసకొడుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో అతడు పాములు అని భావించాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. అతను వచ్చి లోపలికి వెళ్లి చూశాడు. కానీ ఎక్కడా పాము కనిపించలేదు. బుసలు కొడుతున్న శబ్దం వచ్చే ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ వింత గుడ్లగూబలను చూసి షాక్ అయ్యాడు. తెలుపు రంగులో ఉన్న నల్లకళ్లతో ఉన్న ఈ గుడ్డగగూబలను బయటకు తీసుకువచ్చాడు. వాటిని చూసి స్థానికులు షాక్ అయ్యారు.
ఆసక్తిగా చూస్తున్న జనం..
వింతగా ఉన్న ఈ తెల్ల గుడ్డగూబలను చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. తెలుపు రంగులో నల్ల కళ్లతో ఉన్న ఈ గుడ్ల గూబలు రామాయణంలోని జటాయువు పక్షితో పోలుస్తున్నారు. కొందరు వాటికి ఆహారం కూడా పెడుతున్నారు. ఇంతలో ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వారు మనన్‌సింగ్ ఇంటికి చేరుకున్నారు. తెల్లగా ఉన్న బుసలు కొడుతున్న గుడ్లగూబలను పరిశీలించారు. ఇవి అమెరికాలో ఉండే అరుదైన మంచు గుడ్లగూబలుగా గుర్తించారు. అనంతరం వాటిని సురక్షితంగా తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.