Chiranjeevi Heroines : ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళతో నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Chiranjeevi Heroines : మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వారుండరు. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన తీరు సంచలనమే. హీరోగా దాదాపు అయిదు దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా తన ప్రస్తానం ప్రారంభించిన ఆయన 1980 నుం ఇప్పటి వరకు తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు తెరకు తిరుగులేని రాజుగా వెలుగొందుతున్నాడు. Also Read: మెగాస్టార్ “ఆచార్య” సినిమా నుంచి మరో అప్డేట్… ఫుల్ ఖుషీలో […]

Written By: NARESH, Updated On : April 8, 2022 10:12 pm
Follow us on

Chiranjeevi Heroines : మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వారుండరు. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన తీరు సంచలనమే. హీరోగా దాదాపు అయిదు దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా తన ప్రస్తానం ప్రారంభించిన ఆయన 1980 నుం ఇప్పటి వరకు తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు తెరకు తిరుగులేని రాజుగా వెలుగొందుతున్నాడు.

Also Read: మెగాస్టార్ “ఆచార్య” సినిమా నుంచి మరో అప్డేట్… ఫుల్ ఖుషీలో అభిమానులు

chiranjeevi

ఒక్కొక్క సినిమాను బ్లాక్ బస్టర్ గా చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలుస్తోంది. ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు విభిన్న చిత్రాల్లో నటించి తన నటనా పాటవాన్ని ప్రదర్శించాడు. ప్రతి చిత్రానికి తనలోని నటుడికి ప్రాణం పోస్తూ విభిన్న పాత్రలు చేసి మెప్పించడం తెలిసిందే. దీంతో సినిమా పరిశ్రమలో తానేమిటో నిరూపించుకుని పలు పాత్రల్లో జీవించి మెప్పించారు.

nagma sisters

తెలుగు చిత్ర రంగంలో ఘరానా మొగుడు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, నగ్మా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు పంచ్ డైలాగులతో పసందైన వినోదాన్ని పంచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం గమనార్హం. అంతే కాదు నగ్మా చెల్లెళ్లతో కూడా నటించారు. మాస్టర్ చిత్రంలో రోషిణి, ఠాగూర్ సినిమాలో జ్యోతిక ఇద్దరూ నగ్మా చెల్లెల్లే కావడం తెలిసిందే.

తెలుగు సినిమాల్లో చిరంజీవి కంటే పెద్ద నటుడు లేడని తెలుసు. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన నటుడిగా అందరు గౌరవిస్తారు. అంతటి విలువ సంపాదించుకున్న నటుడు. మరోవైపు సామాజిక సేవ ద్వారా అందరికి సుపరిచతమే. బ్లడ్ బ్యాంకు స్థాపించి ఆపదలో ఉన్న వారికి రక్తం అందజేస్తున్నారు.

Also Read: రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిన స్టార్ హీరోలు