Ram Charan: రామ్ చరణ్-ఎన్టీఆర్ లు కలిసి నటించడం అరుదైన విషయం. మూవీ లవర్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న కాంబినేషన్ ఇది. మెగా-నందమూరి హీరోలు కలిసి మూవీ చేస్తే చూడాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. ఎన్టీఆర్-చిరంజీవి కలిసి కొన్ని సినిమాలు చేశారు. అయితే అప్పటికి చిరంజీవికి స్టార్ డమ్ రాలేదు. చిరంజీవి సూపర్ స్టార్ అయ్యాక… బాలయ్యతో మూవీ చేస్తే బాగుంటుందని పేక్షకులు కోరుకున్నారు. కొందరు మేకర్స్ ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. అయితే అది కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణ-చిరంజీవిల మధ్య స్టార్ వార్ మొదలైంది. వారి సంగతి ఎలా ఉన్నా… ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయి యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

మూడు దశాబ్దాల క్రితం మొదలైన మెగా-నందమూరి ఫ్యాన్ వార్ కొనసాగుతూనే ఉంది. దీన్ని రెండు సామాజిక వర్గాల ఆధిపత్యపోరుగా కూడా చూస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజమౌళి… ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ప్రకటించాడు. ఇది అతిపెద్ద చర్చకు దారితీసింది. సినిమాలో ఏ ఒక్కరి పాత్ర ప్రాధాన్యత తగ్గినా… ఫ్యాన్స్ రాజమౌళిని ఏకిపారేస్తారు. ఇది ఆయనకు పెద్ద ఛాలెంజ్ కూడా. ఆ బాధ్యత రాజమౌళి సమర్థవంతంగా పూర్తి చేశాడు.
నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించడంపై రామ్ చరణ్ పెదవి విప్పారు. ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 20-30 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య బలమైన పోటీ నెలకొని ఉంది. ఎన్టీఆర్ తో మూవీ చేస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలుసు. అయితే దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చూశాము. సీనియర్ ఎన్టీఆర్, నాన్న చిరంజీవి మధ్య చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉండేది, అని చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్ తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రాజమౌళి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కథలో చరణ్ రోల్ కి ఉన్న ప్రాధాన్యత ఎన్టీఆర్ రోల్ కి లేదన్న అభిప్రాయం వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దూషించడం జరిగింది. బాలీవుడ్ మీడియా ఈ ప్రశ్న నేరుగా చరణ్ ని అడిగారు. అప్పుడు వేదికపై ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. చరణ్ ఆ ప్రశ్న తెలివైన సమాధానంతో దాటవేశారు. ఇంట్రో సీన్ తో పాటు క్లైమాక్స్ లో రామ్ చరణ్ బాగా ఎలివేట్ అయ్యాడు.