https://oktelugu.com/

Oscars-2023 Nominations ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ కు షాక్.. గుజరాత్ సినిమా ఆస్కార్ కు.. మతలబు ఏంటబ్బా?

Oscars-2023 Nominations : దేశమంతా ఇప్పుడు గుజరాతీమయం అవుతోంది. అన్ని ప్రాజెక్టులు, నిధులు, కొత్త సిటీలన్నీ గుజరాత్ కే పోతున్నాయన్న అపవాదు ఉంది. దేశంలోనే పవర్ ఫుల్ ఇద్దరు వ్యక్తులు (మోడీ, షాలు) గుజరాతీలు. దీంతో సహజంగానే ఆ రాష్ట్రానికి నిధులు పోటెత్తుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు కేటాయించిన లక్షన్నర కోట్ల ‘వేదాంత-ఫోక్స్ కాన్ ’ మైక్రోచిప్స్ ప్రాజెక్టు కూడా గుజరాత్ కు తరలిపోయింది. సికింద్రాబాద్ ఈ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కే పోయింది. ఇలా ఒక్కటేమిటీ గుజరాత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2022 / 07:46 PM IST
    Follow us on

    Oscars-2023 Nominations : దేశమంతా ఇప్పుడు గుజరాతీమయం అవుతోంది. అన్ని ప్రాజెక్టులు, నిధులు, కొత్త సిటీలన్నీ గుజరాత్ కే పోతున్నాయన్న అపవాదు ఉంది. దేశంలోనే పవర్ ఫుల్ ఇద్దరు వ్యక్తులు (మోడీ, షాలు) గుజరాతీలు. దీంతో సహజంగానే ఆ రాష్ట్రానికి నిధులు పోటెత్తుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు కేటాయించిన లక్షన్నర కోట్ల ‘వేదాంత-ఫోక్స్ కాన్ ’ మైక్రోచిప్స్ ప్రాజెక్టు కూడా గుజరాత్ కు తరలిపోయింది. సికింద్రాబాద్ ఈ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కే పోయింది. ఇలా ఒక్కటేమిటీ గుజరాత్ అంటేనే ఇప్పుడు దేశంలో రోల్ మోడల్ అన్నట్టు కేంద్రంలోని పెద్దలు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    విచిత్రం ఏంటంటే.. అన్ని రంగాల్లోనే కాదు.. సినిమాల్లోనూ ‘గుజరాత్’ సినిమా ఆస్కార్ కు నామినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశమంతా కూడా ‘ఆర్ఆర్ఆర్’, ‘కశ్మీర్ ఫైల్స్ ’ లాంటి సినిమాలను ఆదరించారు. నెత్తిన పెట్టుకున్నారు. అందులోని హీరోల నటన, డైరెక్షన్, థీమ్ కు ఫిదా అయిపోయారు. మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు అయితే ఈసారి ఆస్కార్ గ్యారెంటీ అని నిపుణులు, కొన్ని అంతర్జాతీయ ప్రముఖ మీడియాలు, ఆస్కార్ అనుబంధ సంస్థలు అంచనావేశాయి. కట్ చేస్తే.. అసలు సోదీలో లేని.. ఎవరికీ తెలియని.. చూడని ఒక గుజరాత్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. అందరినీ విస్మయానికి గురిచేసింది.

    గుజరాతీ సినిమా ‘చలో షో’ ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. భారత్ నుంచి ఆస్కార్ నామినేషన్లను పంపడంపై సమావేశమైన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ‘ఛలో షో’ సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేసింది.

    ఆస్కార్ నామినేషన్ లో ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలు వెళ్తాయని భావించగా.. ఊహించని విధంగా చలో షో రేసులో ముందుకొచ్చింది. అందరికీ షాక్ ఇచ్చింది. పాన్ నళిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

    -ఏంటి ఛలో షో సినిమా?

    ఛలో షో సినిమా విషయానికి వస్తే.. ఆంగ్లంలో లాస్ట్ ఫిల్మ్ షో పేరుతో పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ బ్యానర్ రాయ్ కపూర్ ఫిల్మ్స్, జుగాద్ మోషన్ పిక్చర్స్, మాన్‌సూన్ ఫిల్మ్స్, నిర్మించాయి. అందులో మార్క్ డ్యూలీ. భవిన్ రబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, దీపేన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గత ఏడాది జూన్‌లో జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ చిత్రంగా ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది.

    గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో చిన్నతనంలో సినిమాల పట్ల ఆకర్షితుడైన నళిన్ జ్ఞాపకాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఫెస్టివల్ రన్ సమయంలో స్పెయిన్‌లోని 66వ వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ స్పైక్‌తో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక్కడ థియేట్రికల్ రన్ సమయంలో ఇది కమర్షియల్ హిట్ అయ్యింది. ఈ గుజరాతీ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపి మన భారత ప్రభుత్వం, ఫెడరేషన్ అవార్డులు గెలుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి. కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఎలాంటి ప్రభావితం చేస్తుందన్నది వేచిచూడాలి.