
NTR: పెయిడ్ ప్రమోషన్స్ కి ములక చెట్టు ఎక్కితే ఇలాంటి అవమానాలే ఎదురవుతాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి అమెరికన్ మీడియా ఆర్భాటం అంతా ప్రమోషన్స్ పుణ్యమే అని తేలిపోయింది. కోట్లు ఖర్చుపెట్టి సినిమాను భారీ ఎత్తున ఊదరగొట్టించారు. ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఎన్టీఆర్ మీద కూడా పీఆర్ సంస్థలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రిడిక్షన్స్ జాబితాలో ఎన్టీఆర్ పేరు ప్రచురించేలా చేశాయి. ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ పది మంది నటులతో కూడిన ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేయగా అందులో ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ కి చోటు కల్పించింది. వెరైటీ మొదటి నుండి ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఇది గమనించాల్సిన విషయం.
ఇక ఇండియన్ మీడియా కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కి ఆస్కార్ అంటూ ఊదరగొట్టారు. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ కి అనుకోకుండానే ఆస్కార్ మీద ఆశలు పెరిగాయి. అవార్డు సంగతి ఎలా ఉన్నా… నామినేషన్స్ లో చోటు దక్కితే చాలు అనుకున్నారు. ఆస్కార్ వంటి ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ నామినేషన్ పొందడం కూడా గొప్ప విషయమే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కలలు కన్నారు. తీరా నామినేషన్స్ ప్రకటన రోజు ఎన్టీఆర్ ఉసూరుమన్నారు. ఎన్టీఆర్ నామినేట్ కాలేదు.
రాజమౌళి కూడా ఎన్టీఆర్ కి ప్రామిస్ చేశాడని సమాచారం. కచ్చితంగా నీ పేరు నామినేషన్స్ ఉంటుందని విశ్వాసం ప్రకటించారట. మొత్తంగా ఎన్టీఆర్ కలలు కల్లలయ్యాయి. నాటు నాటు సాంగ్ కి నామినేషన్ దక్కడం కొంతలో కొంత ఓదార్పు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చాలా కోపంగా ఉన్నారట. ఆయనలో తీవ్ర అసహనం నెలకొందట. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర హైలెట్ అయ్యిందనే బాధ ఎన్టీఆర్ ని వెంటాడుతుంది. ఆర్ ఆర్ ఆర్ చూశాక ఎన్టీఆర్ అభిమానులే ఈ విషయం స్వయంగా ఒప్పుకున్నారు తమ హీరోని తగ్గించేశావని రాజమౌళిని రాయకూడని భాషలో బూతులు తిడుతూ సోషల్ మీడియా కామెంట్స్ చేశారు.

ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ మీట్లో బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ ముందు రామ్ చరణ్ ని ఈ ప్రశ్న అడిగింది. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఇద్దరి పాత్రలు సమానంగా ఉన్నాయని డిప్లోమాటిక్ సమాధానం చెప్పి తప్పుకున్నారు. ఆస్కార్ కి నామినేట్ కావడం ద్వారా ఆ అపవాదు పోగొట్టుకోవాలని ఎన్టీఆర్ అనుకున్నారు. ఆయన కోరిక తీరలేదు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మీద అభిమానుల పైన ఆయన చూపిన కోపానికి కారణం… ఆస్కార్ తాలూకు అసహనమే అంటున్నారు. టాలీవుడ్ వర్గాల్లో ఈ చర్చ జోరుగా నడుస్తుంది.