Orange Re Release: ‘ఆరెంజ్’ రెండవ రోజు వసూళ్లు..వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్

Orange Re Release: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్నటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆరెంజ్’ మూవీ స్పెషల్ షోస్ ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ షోస్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, మొదటి రోజు దాదాపుగా ఈ స్పెషల్ షోస్ కి కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఖుషి, జల్సా , పోకిరి మరియు ఒక్కడు తర్వాత ఆ స్థాయి […]

Written By: Shiva, Updated On : March 27, 2023 5:56 pm
Follow us on

Orange Re Release: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్నటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆరెంజ్’ మూవీ స్పెషల్ షోస్ ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ షోస్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, మొదటి రోజు దాదాపుగా ఈ స్పెషల్ షోస్ కి కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.

ఖుషి, జల్సా , పోకిరి మరియు ఒక్కడు తర్వాత ఆ స్థాయి వసూళ్లను రీ రిలీజ్ లో రాబట్టిన సినిమా ఇదే.ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు. అభిమానులు ఒక ప్రయోగం చేసి భారీ సక్సెస్ సాధించారు. ఇది వరకు కేవలం సూపర్ హిట్ సినిమాలనే రీ రిలీజ్ చేసేవాళ్ళు, మొట్టమొదటిసారి ఒక డిజాస్టర్ సినిమాని ఈ రేంజ్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యడం ఇదే తొలిసారి.

నిన్న అంటే ఆదివారం కాబట్టి ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి అనుకోవచ్చు, కానీ నేడు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి ప్రతీ చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ రోజు కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయిల గ్రాస్ ని వసూలు చేసేలా ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కొత్త సినిమా ‘దసరా’ వచ్చే వరకు ఈ షోస్ ప్రదర్శిస్తూనే ఉంటారు.

Orange Re Release

అలా అప్పటి వరకు ఈ సినిమాకి సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు మరియు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ డబ్బులు మొత్తం జనసేన పార్టీ కి ఫండ్ గా వెళ్లబోతుంది అనే విషయం తెలిసిందే. ఒక డిజాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లను రాబడితే ఇక మగధీర చిత్రాన్ని రీ రిలీజ్ చేసి ఉంటే ఇక ఏ రేంజ్ లో ఉండేదో అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.