Orenge Re-Release : మనం హిట్ చేయలేదు గాని.. ఆరెంజ్ నిజంగానే ఓ రేంజ్ లవ్ స్టోరీ!

Orenge Re-Release : తీసే అన్ని సినిమాలు హిట్ కానట్టే.. ప్రేక్షకులు కూడా హిట్ అయ్యే సినిమాలను ఒక్కో సారి దేకరు. అలాంటి కోవలోకి వస్తుంది అరెంజ్ అనే సినిమా.. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాణంలో ఆరెంజ్ అనే సినిమా లో నటించాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ తేజ్ కు జోడిగా జెనీలియా డిసౌజా నటించింది. కానీ ఈ […]

Written By: Bhaskar, Updated On : April 2, 2023 11:14 pm
Follow us on

Orenge Re-Release : తీసే అన్ని సినిమాలు హిట్ కానట్టే.. ప్రేక్షకులు కూడా హిట్ అయ్యే సినిమాలను ఒక్కో సారి దేకరు. అలాంటి కోవలోకి వస్తుంది అరెంజ్ అనే సినిమా.. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాణంలో ఆరెంజ్ అనే సినిమా లో నటించాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ తేజ్ కు జోడిగా జెనీలియా డిసౌజా నటించింది. కానీ ఈ సినిమా జనాలకు ఎందుకో ఎక్కలేదు. హరీష్ జయరాజ్ స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. పోనీ సినిమా బాగోలేదా అంటే వంక పెట్టే అవకాశం లేదు. హీరో పాత్రకు రామ్ చరణ్ తేజ్ 100% న్యాయం చేశాడు. జెనీలియా తన క్యూట్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అయినప్పటికీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఈ సినిమా మిగిల్చిన అప్పులు తీర్చేందుకు నాగబాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో నాగబాబుకు ఆర్థికంగా సహకరించాడు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి. ఈ సినిమా నష్టాలు పూడ్చుకునేందుకు నాగబాబుకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అంతేకాదు ఒక సంవత్సరం పాటు నాగబాబు బయటికి రాలేదు. తాను సంపాదించింది మొత్తం ఈ సినిమాలో పెట్టాడు. అయినప్పటికీ ఫలితం వేరే విధంగా వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి బొమ్మరిల్లు భాస్కర్ తన ఆవేదనను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే చాలామంది ఈ సినిమాను చూసి.. ఇది ఇప్పుడు రావలసిన కథ కాదు.. ఒక పదేళ్ల కాలాన్ని ముందుగానే ఊహించి తీసిన కథ ఇది.. అందుకే జనాలకు ఎక్కలేదు అని భాస్కర్ పలు సందర్భాల్లో వాపోయాడు.

అయితే ప్రేక్షకుల కోరిక మేరకు ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని థియేటర్లలో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా నడుస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా లాస్ట్ రన్ ఎంత వసూలు చేసిందో.. రీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్లు అంత వసూలు చేసింది. అంటే అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల్లో మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఉంది కాబట్టే సినిమా జనాలకు ఎక్కుతోంది. అందుకే ఒక్కోసారి ప్రేక్షకులు హిట్ చేయాల్సిన సినిమాను ప్లాప్ చేయడం వల్ల చాలా సమస్యలే ఎదురవుతాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నదే ఆరెంజ్.. ఒక మాటలో చెప్పాలంటే ఇది నిజంగా ఒక రేంజ్ లవ్ స్టోరీ.. అందులో ఎటువంటి డౌటూ లేదు.