
Orange Re Release: మరో రెండు వారాల్లో రామ్ చరణ్ బర్త్ డే. అభిమానులు వేడుకలు సిద్ధం అవుతున్నారు. ఇక అభిమాన హీరో పుట్టినరోజు నాడు పాత చిత్రాల రీరీలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దీనిలో భాగం రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉన్న మగధీర చిత్రాన్ని విడుదల చేయాలని ఫ్యాన్స్ భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే మగధీరకు బదులు ఆరెంజ్ చిత్రం విడుదల చేయాలని బావిస్తున్నారట. ఆరెంజ్ మూవీ రీరీలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీ ఫండ్ డ్రైవ్ కి డొనేట్ చేస్తారట. ఈ మేరకు సమాచారం అందుతుంది.
మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఆరెంజ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మగధీర ఎఫెక్ట్ ఆ చిత్ర ఫలితాన్ని దెబ్బతీసింది. మగధీర రామ్ చరణ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. మగధీర తర్వాత రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ ప్యూర్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ లేని చిత్రం. అందుకేనేమో ప్రేక్షకులకు ఎక్కలేదు.
అయితే ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆరెంజ్ కూడా రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ మూవీగా భావించేవాళ్ళు ఉన్నారు. ఆరెంజ్ చిత్ర సాంగ్స్… ఎప్పటికీ వెంటాడే జ్ఞాపకాలు. హరీష్ జయరాజ్ అంత గొప్ప ఆల్బమ్ ఇచ్చారు. ఈ పాట బాగుంది ఇది బాగోలేదు అనడానికి లేదు. ప్రతి సాంగ్ ఒక డైమండ్. కాబట్టి ఆరెంజ్ రీరీలీజ్ లో అద్భుతం చేసే అవకాశం కలదు. ఆరెంజ్ చిత్ర రీరిలీజ్ పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కాగా, ఈసారి చాలా స్పెషల్. ఈ ఏడాది ఆయన ఊహించని విజయాలు అందుకున్నారు. ఆయన ఇమేజ్ ఇండియన్ బౌండరీలు దాటేసింది. అమెరికాలో ఆయనకున్న క్రేజ్ ఏమిటో అర్థం అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించారు. గుడ్ మార్నింగ్ అమెరికా ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ నిలిచారు. ఇక నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే.