
Morning Eat: మనలో చాలా మంది ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. ఉదయం పూట లేచింది మొదలు పడుకునే వారు నానా రకాల పదార్థాలు కడుపులో వేసుకుంటున్నారు తప్ప వాటి వల్ల ఒనగూడే ప్రయోజనాలేంటని తెలుసుకోవడం లేదు. ఫలితంగా పలు రకాల జబ్బుల బారిన పడుతున్నారు. తరువాత ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ చేతుల మురికి వదిలించుకుంటున్నారు. మన ఆహార అలవాట్లు మనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. కానీ ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉదయం లేచింది మొదలు ఏది పడితే అది తింటూ అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నాం. ఉదయం పూట మంచి ఆహారాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మనం చొరవ తీసుకోకపోతే నష్టమే కలుగుతుంది.
వ్యాయామాల కోసం..
ఆధునిక కాలంలో చాలా మంది ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్నా కొంతమంది మాత్రం నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. ఉదయం పూట వాకింగ్ చేయడం ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతి రోజు కనీసం ఓ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల దాదాపు 25 రకాల రోగాలను దూరం చేస్తుంది. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు సైతం వాకింగ్ తో కంట్రోల్ లో ఉంటాయని వైద్యులు చెబుతుండటంతో వాకింగ్ ఒక్కటే మంచి పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అందుకే వాకింగ్ కోసం సమయం కేటాయించుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చొరవ తీసుకోవాలి.
ఆహారం
ఉదయం పూట మనం తీసుకునే ఆహారం కూడా మనకు మేలు చేస్తుందని గ్రహించుకోవాలి. ఇడ్లీ, దోశ, పూరీ, వడ, పరోటా వంటివి కాకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే వాటిని తీసుకోవడానికి మొగ్గు చూపాలి. ఉదయం సమయంలో అరటిపండు, ఎండు ద్రాక్ష, బాదం పప్పులను తీసుకోవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి ఆరోగ్యాన్ని అందివ్వడంలో దోహదపడతాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, నీరసం వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకోవడం మంచిది కాదు.
డయాబెటిస్ తో..
డయాబెటిస్ తో బాధపడేవారు అరటిపండు తీసుకోవడం మంచిది కాదు. ఇంకా ఊబకాయం, కంటి జబ్బులు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు కూడా దీన్ని తీసుకోవద్దు. చర్మం పొడిబారే సమస్య ఉన్న వారు కూడా అరటిపండు తీసుకోకుండా ఉండాలి. రాత్రి నానబెట్టిన బాదంపప్పును ఉయం పొట్టు తీసి తినడం వల్ల మంచి లాభం ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యలతో ఇబ్బందులు పడేవారు కూడా ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. వీటిని తీసుకునే ముందు ఓ గ్లాసు నీరు తాగితే ఇంకా సురక్షితం.

ఏం చేయాలి?
ఉదయం పూట నూనెతో తయారు చేసిన పదార్థాలు కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తీసుకోవడం ఉత్తమం. ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంకా మంచిది. నూనెలో వేయించినవి తీసుకోవడం వల్ల లివర్ కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఉదయం పూట జ్యూస్ లు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా ఉదయం సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడే వాటిని తీసుకుని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.