Viral Video: వందే భరత్ రైలు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అందరికీ తెలిసిందే. జెట్ స్పీడ్ వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్ల విషయంలో రైల్వే శాఖ చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ అక్కడక్కడ కొన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. కేరళలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వృద్ధుడు ఒకరు వందే భరత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తిరువనంతపురం నుంచి కాసర్ గాడ్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తోంది. మార్గమధ్యలో తిరువూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆ రైలుకు హాల్ట్ లేదు. దీంతో రైలు వేగంతో దూసుకుపోతోంది. నూట పది కిలోమీటర్ల స్పీడుతో ఆ రైల్వే స్టేషన్ దాటుతోంది. ఈ క్రమంలో ఆదివారం స్టేషన్ వద్ద ఓ వృద్ధుడు పట్టాలు దాటాడు. ప్లాట్ ఫారం నంబర్ వన్ చేరుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగం స్టేషన్లో ప్రవేశించింది. వాయు వేగంతో వస్తున్న రైలును సెకండ్ల వ్యవధిలో ఆ వృద్ధుడు దాటి ప్రాణాలను దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.
అయితే ఆ వృద్ధుడు రైలు పట్టాలు దాటే క్రమంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు చూసి ఆందోళనకు గురయ్యారు. వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి దక్కించుకున్న ఆ వృద్ధుడ్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. స్టేషన్ సిబ్బంది చివాట్లు పెట్టారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో ఆందోళన గురయ్యారు.ప్రాణాలు దక్కించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Chacha Ke Liye 2 Shabd Pleaase !!
Was it his skill or Luck ?#VandeBharatExpress #VandeBharat pic.twitter.com/FkTrlhnSDJ— Trains of India (@trainwalebhaiya) November 12, 2023