Okkadu movie Collections : ఒక్కడు రీ రిలీజ్ : రెండవ రోజు కూడా నిరాశయే.. కలెక్షన్స్ రాకపోవడానికి కారణం అదేనా!

Okkadu movie Re Release  Second Day Collections :  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘ఒక్కడు’..ఆరోజుల్లో ఈ చిత్రం సృష్టించిన సునామి మామూలుది కాదు..టాలీవుడ్ కి ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి సినిమా అని చెప్పొచ్చు..ఈ సినిమా ఇక్కడ భారీ హిట్ అయ్యేసరికి ఇదే సినిమాని తమిళం లో విజయ్ ‘గిల్లీ’ అనే పేరు తో రీమేక్ చేసాడు..అక్కడ ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఆ తర్వాత […]

Written By: NARESH, Updated On : January 8, 2023 4:52 pm
Follow us on

Okkadu movie Re Release  Second Day Collections :  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘ఒక్కడు’..ఆరోజుల్లో ఈ చిత్రం సృష్టించిన సునామి మామూలుది కాదు..టాలీవుడ్ కి ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి సినిమా అని చెప్పొచ్చు..ఈ సినిమా ఇక్కడ భారీ హిట్ అయ్యేసరికి ఇదే సినిమాని తమిళం లో విజయ్ ‘గిల్లీ’ అనే పేరు తో రీమేక్ చేసాడు..అక్కడ ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఆ తర్వాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ‘అజయ్’ అనే పేరుతో రీమేక్ చేసాడు..అక్కడ కూడా భారీ హిట్టే..అలాంటి చరిత్ర ఉన్న ఈ సినిమా నిన్నటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా అభిమానులు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిన్న ఘనంగా విడుదల చేసారు..రెస్పాన్స్ అదిరిపోతోంది అనుకున్నారు కానీ ,ఆశించిన స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అసలు రాలేదు..దీనితో మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా నిరాశకి గురయ్యారు..సరైన సమయం లో ఈ చిత్రాన్ని ఈ రిలీజ్ చేసి ఉంటే ఖుషి మరియు జల్సా రీ రిలీజ్ గ్రాస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేవాళ్ళం అని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ వాపోతున్నారు.

వాస్తవానికి ఒక్కడు సినిమాని జనవరి 7 వ తారీఖున రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చెయ్యబోతున్నాము అంటూ ఫ్యాన్స్ అధికారిక ప్రకటన చేసారు..భారీ ఎత్తున ప్రొమోషన్స్ కూడా చేసారు..ప్రత్యేకంగా పోస్టర్లు మరియు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా సిద్ధం చేసుకున్నారు..అంత భారీ ఎత్తున ప్రొమోషన్స్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాకి పోకిరి స్పెషల్ షోస్ కి వచ్చినట్టు మాత్రం క్రేజ్ , హైప్ రాలేదు.

కానీ పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ ప్రభంజనం సృష్టించడం తో..అదే రేంజ్ లో ఈ సినిమా కూడా దుమ్ములేపేస్తుందని అంచనా వేసి భారీ స్థాయిలో షోస్ వేసుకున్నారు..కానీ కలెక్షన్స్ మాత్రం నిల్..కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది..ఇక రెండవ రోజు అయితే మరింత దారుణంగా ఆక్యుపెన్సీలు వచ్చాయి..రెండవ రోజు ఈ చిత్రానికి కనీసం 20 లక్షల గ్రాస్ కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.