OG Movie Song: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోపే 50 సెకండ్స్ ఫుటేజీ సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో మేకర్స్ వెంటనే మేలుకొని సాయంత్రం విడుదల చేయాల్సిన పాటని ఇప్పుడే విడుదల చేసేసారు. దీంతో అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదేమి ట్విస్ట్ బాబోయ్ అని. ఒక పాట పై ఈ రేంజ్ అంచనాలు ఉండడం ఈమధ్య కాలం లో ఏ సినిమాకు మనం చూడలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ని ఆదీనం లోకి తీసేసుకున్నారు. అయితే పాట విడుదల తర్వాత అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇది కదా రా పవన్ కళ్యాణ్ నుండి మేము కోరుకున్న స్టఫ్ అంటూ మురిసిపోతున్నారు.
Also Read: జై హనుమాన్ తో ప్రశాంత్ వర్మ దేశాన్ని ఆకర్షిస్తారా..?
గత కొంత కాలంగా నాసిరకపు పాటలు విని విని విసుగెత్తిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి , ఒక్కసారిగా ఈ రేంజ్ స్టఫ్ దొరకడం తో వాళ్లకు నోటి నుండి మాటలు రావడం లేదు. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్..పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. ‘ఓజాస్..గంభీరా హై’ అంటూ వచ్చే బీట్ దగ్గర పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చిన షాట్ వేరే లెవెల్ లో ఉంది. వింటేజ్ రోజుల్లో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా ఉండేవో, అలా ఉన్నాయి ఈ పాటలో కూడా. ఓవరాల్ గా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకా అంచనాలకు మించేలాగానే ఈ పాట ఉంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పాటకు ఎన్నో రికార్డ్స్ పెట్టాలని అనుకున్నారు, కానీ అకస్మాత్తుగా వదిలేలోపు ఆ రికార్డ్స్ కొన్ని మిస్ అయ్యేలా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన లింక్ ని క్రింద అందిస్తున్నాము, మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
