Homeట్రెండింగ్ న్యూస్October New Rules: ఈ రోజు నుంచి అమలు అయ్యే ఈ నిబంధనల గురించి కచ్చితంగా...

October New Rules: ఈ రోజు నుంచి అమలు అయ్యే ఈ నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

October New Rules: సెప్టెంబర్ నెల ముగిసి. అక్టోబర్ నెల ప్రారంభం అయింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి, దేశంలో చాలా పెద్ద మార్పులు జరగనున్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. వీటిలో ఎల్‌పిజి సిలిండర్ ధర నుంచి క్రెడిట్ కార్డ్‌లు, సుకన్య సమృద్ధి, పిపిఎఫ్ ఖాతాల నియమాలలో మార్పుల వరకు అన్నీ ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందాం.

ఎల్‌పీజీ ధరలు: చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన కొన్ని మార్పులు చేస్తాయి. అదే విధంగా ఈ రోజు నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మారుస్తాయి. అలాగే సవరించిన ధరలను ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి జారీ అయ్యాయి. ఈ మధ్య కాలంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో అనేక మార్పులు కనిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ మార్పు కాస్త ఈ రోజు నుంచి కనిపించింది.

ఏటీఎఫ్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు: దేశవ్యాప్తంగా నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో మార్పులు రావడం మాత్రమే కాదు.. చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలను కూడా సవరిస్తుంది. వాటి కొత్త ధరలను కూడా వెల్లడించారు. ముందుగా సెప్టెంబర్ నెలలో ఏటీఎఫ్ ధరలను తగ్గించడం గమనార్హం.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి సంబంధించినది. మీరు కూడా హెచ్‌డీఎప్‌సీ లో అకౌంట్ తీసుకొని ఉంటే.. కొన్ని క్రెడిట్ కార్డ్‌ల కోసం లాయల్టీ ప్రోగ్రామ్ మార్చారు అని మీకు తెలుసా? అయితే కొత్త నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అంటే ఈ రోజు నుంచి వర్తిస్తాయి. తదనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ SmartBuy ప్లాట్‌ఫారమ్‌లో యాపిల్‌ ఉత్పత్తులకు రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం చేసింది.

సుకన్య సమృద్ధి యోజన రూల్ మార్పు: ముఖ్యంగా కుమార్తెల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ కు సంబంధించి ఒక పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు కూడా కూడా ఈ రోజు నుంచి అమలు అవుతుంది. దీని ప్రకారం, కుమార్తెల చట్టబద్ధమైన సంరక్షకులు మాత్రమే మొదటి తేదీ నుంచి ఈ ఖాతాలను నిర్వహిస్తారు. కొత్త నిబంధన ప్రకారం, ఒక కుమార్తె సుకన్య సమృద్ది ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచినట్లయితే, ఆమె ఈ ఖాతాను సహజ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయాలి. అలా చేయని పక్షంలో ఆ ఖాతాను మూసివేసే అవకాశం కూడా ఉంది.

పీపీఎఫ్‌: పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల క్రింద నిర్వహించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా మూడు మార్పులు జరిగాయట. ఈ మార్పులు కూడా ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఆగస్టు 21, 2024న, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కొత్త నిబంధనలను జారీ చేసింది. అంతేకాదు వ్యక్తి (మైనర్) ఖాతాను తెరవడానికి అర్హత పొందే వరకు అటువంటి సక్రమంగా లేని ఖాతాలపై పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వడ్డీ చెల్లింపులు జరుగుతుంటాయి. అంటే వ్యక్తికి 18 ఏళ్లు వచ్చే వరకు పీపీఎఫ్ వడ్డీ రేటు చెల్లించడం అన్నమట. మైనర్ పెద్దవాడైన తేదీ నుంచి మెచ్యూరిటీ వ్యవధి లెక్కించి వ్యక్తి ఖాతా తెరవడానికి అర్హత పొందిన తేదీ వరకు లెక్క కడతారు అన్నమాట.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular