
Ohio Train Derailment: ఓ గూడ్స్ రైలు ప్రమాదం అమెరికాను వణికిస్తున్నది. అది కఠిన ఆంక్షలు అమలు చేసే దాకా వెళ్ళింది. అంతే కాదు అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏకంగా సైన్యం రంగంలోకి దిగింది. ఇటీవల అమెరికా దేశంలోని ఒహియో రాష్ట్రంలో ఓ గూడ్స్ రైలు బోల్తా పడింది. ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమయిన వాయువులు గాలిలో కలిశాయి. దీంతో అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోడ్డు ప్రమాదం ఒహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్ పాలస్టెయిన్ అనే గ్రామం వద్ద ఫిబ్రవరి 4 న జరిగింది. ఈ ప్రమాదంలో 50 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ రైలు బోగీలో వినైల్ క్లోరైడ్ తరలిస్తున్నారు. 150 బోగీలతో మాడిసన్ నుంచి బయలు దేరిన ఈ రైలు పెన్సెల్వేనియా లోని కాన్వే కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో11 బోగీల్లో వినైల్ క్లోరైడ్, బ్యూ టైల్ ఆక్ర లేట్ ఉంది. ఇవి ప్రమాదకరమయిన కెమికల్స్. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టు పక్కల ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళని దాదాపు 5 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి వారి స్వస్థలాలకు పంపారు.
ఈ ప్రమాదంలో రైలు చక్రాలు రాసుకుని నిప్పు రవ్వలు ఏర్పడి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. ఇవి వినైల్ క్లోరైడ్ కు అంటు కోవడం తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఫలితంగా విష వాయువులు గాలిలోకి విడుదలయ్యాయి. అయితే ఈ విష వాయువుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని అక్కడి నేషనల్ క్యాన్సర్ సెంటర్ అంచనా వేస్తున్నది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు ఒక మైలు దూరం వరకు గాల్లో జరిగిన మార్పులను అమెరికా గమనిస్తోంది. భూ గర్భ జలాలను కూడా గమనిస్తున్నది.

అక్కడి బోర్లల్లో నీటిని గమనించగా ఎలాంటి ఇబ్బందీ లేదని తేలింది. అయితే మరిన్నీ పరీక్షల ఫలితాలు రావాలని అక్కడి అధికారులు అంటున్నారు. ఆ ప్రాంతానికి దగ్గర లో ఉన్న నదులు, కాల్వల్లోని నీటిని సైతం పరీక్షల కోసం సేకరిస్తున్నారు. ఒకవేళ క్యాన్సర్ తాలుకూ ప్రమాదం ఉంటే మాత్రం వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.