NTR: ఫ్యాన్స్ కి కన్నీరు రప్పిస్తున్న ఎన్టీఆర్ నిర్ణయం.. చివరి చిత్రం అదేనా?

NTR: #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల నటనకి ప్రపంచం నలుమూలల ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు..రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ తో చేస్తున్నాడు..షూటింగ్ సగానికి పైగా జరిగిపోయింది..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చెయ్యబొయ్యే సినిమాలు కూడా ప్రకటించేశాడు..కానీ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి […]

Written By: Neelambaram, Updated On : December 9, 2022 2:42 pm
Follow us on

NTR: #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల నటనకి ప్రపంచం నలుమూలల ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు..రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ తో చేస్తున్నాడు..షూటింగ్ సగానికి పైగా జరిగిపోయింది..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చెయ్యబొయ్యే సినిమాలు కూడా ప్రకటించేశాడు..కానీ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి కదలిక లేదు..#RRR విడుదల తర్వాత నుండి ఆయన కాళిగానే ఇంట్లో కూర్చున్నాడు..కొరటాల శివ తో సినిమా చేస్తున్నట్టుగా ఎప్పుడో అధికారిక ప్రకటన చేసినప్పటికీ.

NTR

ఇప్పటికి కూడా ఆ చిత్రం కనీసం పూజ కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు..దాంతో అభిమానుల ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరింది..అసలు ఎన్టీఆర్ కి సినిమాల మీద ఆసక్తి పోయిందా..ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో పెదవి విరుస్తున్నారు..అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను కంగారు పెడుతుంది.

అసలు విషయానికి వస్తే కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదట..ఆయన వద్దకి ఈ ఏడాది కాలం లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ కథలు చెప్పడానికి వస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ వారికి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని చెప్పి పంపేస్తున్నారట..ఈ వార్త తెలిసి ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురైయ్యారు..ఎన్టీఆర్ ద్రుష్టి ప్రస్తుతం రాజకీయాలవైపు మరలిందని..అందుకే ఆయన సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీ లో ఒక టాక్ బలంగా వినపడుతుంది..మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ రాబొయ్యే రోజుల్లో తెలుస్తుంది.

NTR

ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ నాయకులను కలవడం వంటివి ఇప్పుడు వినపడుతున్న వార్తలకు బలం చేకూరుతుంది..ఎన్టీఆర్ ప్రస్తుతం యంగ్ ఏజ్ లో ఉన్నాడని..ఆయన హీరో గా చూడాల్సిన ఎత్తులు ఎన్నో ఉన్నాయని..అలాంటి పీక్ కెరీర్ ని వదులుకొని రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయం కాదని అభిమానులు సన్నిహితులు చెప్తున్నారు.

Tags