NTR Remuneration- Assets: నందమూరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వారింట మూడోతరం వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. తాత నందమూరి తారకరామారావుతో కలిసి బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చి అంచలంచెలుగా ఎదిగారు. ఎనర్జిటిక్ యాక్షన్ తో దుమ్ములేపేస్తున్నాడు. ఇటీవల నటించిన ఆర్ఆర్ఆర్ రిలీజై ఎన్టీఆర్ లోని అద్భుత నటుడిని ఆవిష్కరించింది. తాజాగా ఆయన 30వ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తతం అది వైరల్ గా మారింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన జీవితకాలంలో ఎంత సంపాదించారు..? ఆయన సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత..? అనే విషయం ఆసక్తికర విషయాలు మీ కోసం.
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అనే సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తరువాత బాలరామయణం సినిమాలో నటించారు. ఆ తరువాత చదువుపై శ్రద్దపెట్టారు. మళ్లీ 2001లో ‘నిన్ను చూడాలని ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదట్లో ఎన్టీఆర్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కు సినీ అవకాశాలు పెరిగాయి. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆది’ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరో అనిపించుకున్నాడు.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ లక్ష రూపాయాలతో మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు గాను ఎన్టీఆర్ కు 2.5 లక్షల పారితోషికం లభించింది. తొలి సంపాదనను తల్లి శాలినికి ఎన్టీఆర్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెరుగుతూ వచ్చింది. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ కు ఏకంగా 35 నుంచి 40 కోట్ల వరకు పారితోషికం దక్కినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన పారితోషికాన్ని సినిమాను బట్టి 30-35 కోట్ల మధ్యన తీసుకుంటున్నట్టు తెలిసింది. కొరటాల సినిమాకు ఇదే ఫిక్స్ చేసినట్లు భోగట్టా. ఏదేమైనా తెలుగులో టాప్ హీరోలతో సమానంగా ఎన్టీఆర్ పారితోషికంగా తీసుకుంటుండడం విశేషం.
సినిమాల్లోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ ఆస్తులు భారీగా పెరిగాయి. ప్రస్తతం జూబ్లిహిల్స్ లో ఆయనకు ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఎన్టీఆర్ ఎప్పుడూ హై ప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. ఆయన వాడుతున్న కార్లు 3. 5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయి. తారక్ వాడుతున్న వాచ్ 2.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఇటీవలే హైదరాబాద్ శివారులో ఓ ఆరు ఎకరాల ఫాంహౌస్ ను కొన్నాడు. ఇక సినిమాల్లో వచ్చిన డబ్బులతో భూములు, ఆస్తులను కొని పెట్టుకున్నట్టు తెలిసింది. మొత్తంగా ఎన్టీఆర్ దాదాపు 450 నుంచి 500 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Jr NTR Birthday: జూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానుల నీరాజనాలు